Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాటిల్ పైకి ఎగరేసి బాలయ్య ప్రచారం, దూసుకెళ్తున్న నట సింహం - Video

ఐవీఆర్
శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (17:44 IST)
బాలయ్య స్టైలే సెపరేట్. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి నట సింహం ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గం వ్యాప్తంగా రోడ్ షో చేస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు కొందరు ఆయనకు మంచినీళ్ల బాటిల్ అందించారు. దాన్నలా అందుకుని గటగటా నీళ్లు తాగి మూతపెట్టి ఆ బాటిల్ ను పైకి ఎగరేసి చేత్తో పట్టుకుని తిరిగి అంతే స్పీడుతో విసిరేసారు. ఆ తర్వాత తెలుగుదేశం కండువాను అందుకుని వాహనంపైనున్న నాయకుడి మెడలో వేసారు. తదుపరి ప్రసంగం మొదలుపెట్టారు.
 
జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. గులకరాయి నాటకాలతో ఓట్లు వేయించుకోవాలని యాక్ట్ చేస్తున్నారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. సంక్షేమం అంటే తెలుగుదేశం ప్రభుత్వం అని గుర్తు చేసారు. దేశంలో ఎవ్వరూ చేపట్టని కిలో 2 రూపాయల పథకం ఆనాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టారనీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడుగారు వృద్ధులకు ఫించన్లు, డ్వాక్రా సంఘాలు, అన్న క్యాంటీన్లు... యువత కలలు సాకారం చేసేందుకు ఐటీ పరిశ్రమలు.. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు.
 
ఇప్పుడు జగన్ ఏపీకి వున్న బ్రాండ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసారనీ, రాష్ట్రాన్ని అప్పులుకుప్పగా మార్చారంటూ మండిపడ్డారు. ఏపీ రాజధాని ఎక్కడ అంటే ప్రతి ఆంధ్రుడు ఎక్కడ అని చెప్పాలో తెలియని అయోమయ స్థితి కల్పించాడని విమర్శించారు. అందుకే మీ ఓటుతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments