చంద్రబాబు మళ్లీ సీఎం కాకపోతే జ్యోతిషం వదిలేస్తా... ఎవరు?

Webdunia
మంగళవారం, 7 మే 2019 (13:57 IST)
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా వుండబోతాయన్న ఆసక్తి ఇప్పుడు మరింత పెరుగుతోంది. ఎందుకంటే... అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ సీఎం పదవి తమను వరిస్తుందంటే తమను వరిస్తుందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటూ ఓ నేమ్ ప్లేట్ కూడా రెడీ అయిపోయింది. 
 
ఇవన్నీ ఇలావుంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెదెపా ఢంకా బజాయించి విజయం సాధిస్తుందంటూ ప్రముఖ జ్యోతిష్కుడు అంటున్నారు. తెదేపాకు ఏకంగా 112 సీట్లు వస్తాయని చెపుతున్నారు. ఈ బంపర్ మెజారిటీతో చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తారని చెప్పారు. ఇదే వాస్తవం కాబోతోంది చూడండి అంటూ ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణుడు శివరామశాస్త్రి చెపుతున్నారు.
 
ఒకవేళ తను చెప్పిన జ్యోతిషం నిజం కాకపోతే భవిష్యత్తులో జ్యోతిషం చెప్పడం మానేస్తానని సవాల్ కూడా చేశారు. అంతేకాదు తను చెప్పిన మాటను రూ. 100 బాండ్ పేపరుపై రాసిమ్మన్నా రాసిచ్చేందుకు తను సిద్ధంగా వున్నానని అంటున్నారు. మొత్తమ్మీద ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి బాబు అని కొందరంటుంటే జగన్ అని మరికొందరు అంటున్నారు. మరి ఏపీ ప్రజల తీర్పు ఎలా వుందో తెలియాలంటే మే 23 వరకూ ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments