Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెంటిమెంట్ రాజేస్తున్న చంద్రబాబు

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (09:15 IST)
ఎన్నికల పోలింగ్ సమయం మరికొన్ని గంటలో మిగిలివున్నాయి. ఈనెల 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి 175 అసెంబ్లీ సీట్లతో పాటు.. 25 ఎంపీ సీట్లకు పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేశారు. అదే సమయంలో ఎన్నికల ప్రచారంలో పార్టీల నేతలు నిమగ్నమైవున్నారు. 
 
ముఖ్యంగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చివరి రోజున సెంటిమెంట్ రగిలిస్తున్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి, తెరాస చీఫ్ కేసీఆర్‌లను దొంగల ముఠాతో అభివర్ణించారు. అదేసమయంలో తాను కొందరివాడిగా ఉండనని, అందరివాడిగా ఉంటానని హామీ ఇచ్చారు .
 
175 స్థానాల్లో తననే అభ్యర్థిగా భావించి... తెలుగుదేశాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారన్నారు. నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్ట్‌లను తన గుప్పిట్లో పెట్టుకొని నీళ్లు రాకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. 
 
పోలవరం నిర్మాణంతో మునిగిపోతుందంటున్న భద్రాచలంను తమకు ఇచ్చేయాలన్నారు. భద్రాచలంను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తమకు తెలుసని చంద్రబాబు అన్నారు. తనకు కులం, మతం లేదని, తన కులం అభివృద్ధని, తన మతం సంక్షేమనన్నారు. కొందరివాడిగా ఉండనన్న ఆయన... అందరివాడుగా ఉండాలన్నదే తన లక్ష్యమంటూ ప్రచారంలో సెంటిమెంట్‌ను రాజేస్తూ ముందుకు సాగిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments