Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ ప్రచార సభలో మరో అపశృతి.. తొక్కిసలాటలో వ్యక్తి మృతి...

Advertiesment
జగన్ ప్రచార సభలో మరో అపశృతి.. తొక్కిసలాటలో వ్యక్తి మృతి...
, శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (18:00 IST)
వైసీపీ అధినేత జగన్ చిత్తూరు జిల్లా కుప్పంలో ఈరోజు ఉదయం నిర్వహించిన ప్రచార సభలో మరో అపశృతి చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో జగన్ సభకు భారీగా జనం తరలివచ్చారు. బహిరంగ సభలో జగన్ ప్రసంగించి వెనుదిరిగిన తర్వాత అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఓ వ్యక్తి మరణించాడు. 
 
మృతి చెందిన వ్యక్తి పెద్దూరు మాజీ సర్పంచ్ బేట్రాయుడుగా గుర్తించారు. సరిగ్గా రెండురోజుల క్రితం గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లలో జగన్ పాల్గొన్న బహిరంగ సభలో విద్యుదాఘాతంలో ఒకరు మృతిచెందిన ఘటన మరువక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది.. గూగుల్‌లో జాబ్ పట్టేసింది..