Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖకు పరిపాలనా రాజధాని ఖాయం : వైవీ సుబ్బారెడ్డి

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (17:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపైకి తెచ్చిన మూడు రాజధానుల అంశాన్ని వదిలిపెట్టేలా లేదు. విశాఖకు పరిపాలనా రాజధాని, కర్నూలుకు న్యాయ రాజధాని, అమరావతికి శాసన రాజధానిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో వైకాపా రీజినల్ కో ఆర్డినేటర్‌‌గా నియమితులైన తితిదే ఛైర్మన్, వైకాపా నేత వైవీ సుబ్బారెడ్డి ఆదివారం వైకాపాకు చెందిన నేతలు, జీవీఎంసీ అధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. వైజాగ్ పరిపాలనా రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖకు పరిపాలనా రాజధాని రావడం ఖాయమని చెప్పారు. 
 
వీలైనంత త్వరలో న్యాయపరమైన సమస్యలు, చిక్కులు తొలగిపోయి విశాఖకు పరిపాలనా రాజధాని వస్తుందని వెల్లడించారు. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఉంటుందని తెలిపారు. వార్డుల వారీగా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తామని తెలిపారు. 
 
ఇకపోతే, ఉభయ గోదావరి జిల్లాలో ఇటీవల సంభవించిన వరదలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. కేవలం తమ ఉనికిని కాపాడుకునేందుకే విపక్షాలు వరదలను తమ రాజకీయాలకు ప్రధాన అస్త్రంగా మార్చుకున్నాయన్నారు. వరద బాధితులను ప్రభుత్వ యంత్రాంగం ఆదుకుందని, అనేక లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించిందని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments