Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ శాసనమండలిలో టీడీపీకి తగ్గి వైకాపాకు పెరిగిన బలం

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (08:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో అధికార, విపక్ష పార్టీల బలాబలాలు తారుమారయ్యాయి. శుక్రవారం నుంచి వైసీపీ బలం పెరగనుంది. నేటితో ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. దీంతో టీడీపీ ఎమ్మెల్సీల బలం తగ్గనుంది. 
 
ఫలితంగా మండలిలో టీడీపీ బలం 22 నుంచి 15కి తగ్గుతుంది. అదేసమయంలో వైసీపీ బలం 20కి చేరనుంది. ఇటీవలే నలుగురు వైసీపీ సభ్యులను గవర్నర్ నేరుగా మండలికి నామినేట్ చేయడం తెలిసిందే. ఇక, వైసీపీ సీనియర్ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పదవీకాలం కూడా రేపటితో ముగియనుంది.
 
తాజా పరిణామాలతో అసెంబ్లీ, శాసనమండలి రెండింట్లోనూ వైసీపీ ఆధిపత్యం కొనసాగనుంది. ఇప్పటివరకు మండలిలో తనకున్న బలంతో టీడీపీ పలు బిల్లులను అడ్డుకున్న విషయం తెలిసిందే. వైసీపీ సభ్యుల సంఖ్య పెరిగి, టీడీపీ సభ్యుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో ఇకపై ఆ పరిస్థితి కనిపించకపోవచ్చు.
 
పదవీ విరమణ చేయనున్న ఎనిమిది మంది సభ్యుల్లో ఏడుగురు టీడీపీ సభ్యులు ఉన్నారు. టీడీపీ నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం, వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, పప్పల చలపతిరావు, గాలి సరస్వతి, జగదీశ్వర్ రావు, వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మండలిలో వైసీపీ సభ్యుల బలం 21కి పెరగనుండగా... టీడీపీ సభ్యుల సంఖ్య 15కు తగ్గనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం హార్డ్ వర్క్, టాలెంట్ కు దక్కిన ఫలితమే క విజయం

పాన్ ఇండియా చిత్రాలకు ఆ తమిళ హీరోనే స్ఫూర్తి : ఎస్ఎస్.రాజమౌళి

రెబల్ స్టార్ ప్రభాస్ తో మూడు మెగా సినిమాలు ప్రకటించిన హోంబలే ఫిల్మ్స్

'అమ్మ'కు ఆఫీస్ బాయ్‌గా కూడా పని చేయను : మోహన్ లాల్

ఇండస్ట్రీలో ఎవ్వరూ ఎవరికీ సపోర్ట్ చేయరని తేల్చి చెప్పిన దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments