Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kavati Manohar: గుంటూరు నగర మాజీ మేయర్ కావటి సస్పెండ్

ఠాగూర్
సోమవారం, 9 జూన్ 2025 (11:13 IST)
Kavati Manohar
గుంటూరు నగర మాజీ మేయర్, వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడును పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.
 
మనోహర్ నాయుడుతో పాటు రెండో డివిజన్ కార్పొరేటర్ మర్రి అంజలి, ఐదో డివిజన్ కార్పొరేటర్ యాట్ల రవికుమార్‌లను కూడా క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ సస్పెండ్ చేసినట్లు వైసీపీ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.
 
కాగా, కావటి మనోహర్ నాయుడు గత ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఏడాది మార్చి రెండో వారంలో గుంటూరు నగర మేయర్ పదవికి కూడా రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఆయనను సస్పెండ్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments