Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి : అభ్యర్థులను ప్రకటించిన వైకాపా

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (16:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఇందులోభాగంగా అధికార వైకాపా పార్టీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సోమవారం ప్రకటించింది. మొత్తం 18 స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఇందులో స్థానిక కోటాలో 9 మంది, ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, గవర్నర్ కోటాలో ఇద్దరి పేర్లు ఉన్నాయి. మొత్తం 18 స్థానాల్లో బీసీలకు 11, ఓసీలకు 4, ఎస్సీలకు రెండు, ఎస్టీలకు ఒకటి చొప్పున సీట్లు కేటాయించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించిన అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తే, 
 
స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీలుగా పోటీ చేసే అభ్యర్థులు వీరే... 
ఎస్. మంగమ్మ (అనంతపురం, బీసీ బోయ). డాక్టర్ మధుసూదన్ (కర్నూలు, బీసీ బోయ), రామసుబ్బారెడ్డి (కడప, ఓసీ రెడ్డి), డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం (చిత్తూరు బీసీ వెన్నెరెడ్డి), మేరుగ మురళీధర్ (నెల్లూరు, ఎస్సీ మాల), కావూరి శ్రీనివాస్ (వెస్ట్ గోదావరి, బీసీ శెట్టిబలిజ), పంకా రవీంద్రనాథ్ (వెస్ట్ గోదావరి, ఓసీ కాపు), కుడిపూడి సూర్యనారాయణ (ఈస్ట్ గోదావరి, బీసీ శెట్టిబలిజ), సత్తు రామారావు (శ్రీకాకుళం, బీసీ యాదవ)లు ఉన్నారు. 
 
ఎమ్మెల్యే కోటాలో ఏసురత్నం (గుంటూరు బీసీ వడ్డెర), మర్రి రాజశేఖర్ (గుంటూరు, ఓసీ కమ్మ), జయమంగళ వెంకటరమణ (వెస్ట్ గోదావరి, బీసీ వడ్డెర), బొమ్మి ఇజ్రాయిల్ (ఈస్ట్ గోదావరి, ఎస్సీ మాదిక), కోలా గురువులు (విశాఖ, బీసీ వడబలిజ), పోతుల సునీత (ప్రకాశం, బీసీ పద్మశాలి), పెన్మత్స సూర్యనారాయణ రాజు (విజయనగరం, ఓసీ, క్షత్రియ). 
 
గవర్నర్ కోటాలో కర్రి పద్మశ్రీ (బీసీ, మత్స్యకార), కుంభా రవి (అల్లూరి జిల్లా, ఎస్టీ ఎరుకల)లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments