Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబువి ఐరెన్ లెగ్స్... అధికారంలోకి వస్తే కరవుకాటకాలే : ఆర్కే.రోజా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడివి ఐరెన్ లెగ్స్ అని, ఆమె అధికారంలోకి వస్తే కరవు కాటకాలు తప్పవని మరోమారు రుజువైనవని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా ఆరోపించారు. ఆమె బుధవారం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (11:12 IST)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడివి ఐరెన్ లెగ్స్ అని, ఆమె అధికారంలోకి వస్తే కరవు కాటకాలు తప్పవని మరోమారు రుజువైనవని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా ఆరోపించారు. ఆమె బుధవారం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... మాతృభాష తెలుగును కూడా సరిగ్గా మాట్లాడలేని నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వడం సిగ్గుచేటన్నారు. 
 
స్పీకర్ కోడెల శివప్రసాద్, టీడీపీ కార్యకర్తలా మారిపోయారన్నారు. తమ పార్టీ టికెట్ పై పోటీ చేసిన వారికి డబ్బు, పదవులు ఆశ చూపి లాక్కున్నారని, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం దారుణమని ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లగ్జరీ భవంతిని నిర్మించుకున్న చంద్రబాబు, పేద ప్రజల కోసం ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేదని ఆరోపించారు. 
 
చేతికి వాచి, ఉంగరం కూడా లేదనే చెప్పుకునే చంద్రబాబు... విలాసవంతమైన ఇంటిని ఎలా కట్టుకున్నారని ప్రశ్నించారు. పట్టిసీమ, అమరావతి నిర్మాణం పేరుతో దోచుకున్న డబ్బుతోనే ఆయన ఇంటిని నిర్మించుకున్నారని విమర్శించారు. తన కుమారుడు లోకేష్‌కు ఉద్యోగం ఇస్తే రాష్ట్రంలోని యువతకంతా ఉద్యోగాలు ఇచ్చినట్టు చంద్రబాబు ఫీల్ అవుతున్నారన్నారు. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడం దారుణమన్నారు. అప్పటి వైశ్రాయ్ హోటల్ రాజకీయాల నుంచి నేటి వరకు చంద్రబాబు నీచ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments