Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపనమ్మక వ్యవస్థలో పని చేస్తున్నాం.. వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (18:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వ పనితీరుపై ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, విమర్శలు గుప్పిస్తున్నారు. వైకాపా ప్రజాప్రతినిధులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తాజాగా రాపూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక అపనమ్మక వ్యవస్థలో పని చేస్తున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు టీడీపీ ప్రభుత్వాన్ని బాగా విమర్శించాం. ఇపుడు అధికారంలో ఉండి మనమేం చేస్తున్నాం? పనులను ముందుకు తీసుకెళ్లని మనల్ని ప్రజలు నమ్ముతారా? ఏం చేశారని ప్రజలు అడిగితే ఏం చెప్పాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన వలంటీర్లు, కన్వీనర్ల సమావేశంలో మాట్లాడుతూ, తాగడానికి నీళ్లు లేవని, రోడ్లపై గుంతలు పూడ్చలేకపోతున్నామని తెలిపారు. నాలుగేళ్లలో ఏం పని చేశామని ప్రజలు వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతాం? అని ఆనం వ్యాఖ్యానించారు. కండలేరు రిజర్వాయర్ దగ్గరే ఉన్నా రాపూర్‌లో ఒక్క చెరువులో నీళ్లు నింపలేక పోయామని పేర్కొన్నారు. కండలేరు అభివృద్ధి విషయంలో వైఎస్ఆర్ కల నెరవేర్చలేక పోయారని ఆనం విచారం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కలను నెరవేర్చలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments