Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2022 ఏపీ, తెలంగాణ నేరాలు.. సర్వర్ హ్యాక్.. రూ.12.93 కోట్లు స్వాహా

cyber hackers
, మంగళవారం, 27 డిశెంబరు 2022 (14:59 IST)
ఏపీ మహేష్ - కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సర్వర్ ను హ్యాక్ చేసి రూ.12.93 కోట్లు కొల్లగొట్టారు. ఈ వ్యవహారంలో నైజీరియన్ల పేరు కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ, ఏపీలతో పాటు చెన్నై వాసులు పాత్రధారులుగా వున్నాయి. ఈ కేసును కొన్ని రోజుల్లోనే సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అనేక మందిని అరెస్ట్ చేశారు. 
 
అలాగే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్నేషియా పబ్ కు వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం జరగడం కలకలం రేపింది. బాధితురాలిపై ఇన్నోవా కారులో అత్యాచారం జరిగేందుకు ముందు బెంజ్ కారులో అభ్యంతరకరంగా ప్రవర్తించారు. నిందితులుగా వున్న వారిలో ఎమ్మెల్యే కుమారుడితో పాటు అనేక మంది ప్రముఖుల సంతానం ఉన్నారు. వీరిలో అత్యధికులు మైనర్లు కావడం గమనార్హం. 
 
ఇకపోతే.. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వున్న న్యూ బోయగూడ ప్రాంతంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం బీహార్ నుంచి వలసవచ్చిన 11 మంది కార్మికులను పొట్టన పెట్టుకుంది. 
 
అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజ్యాంగాన్ని అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర వ్యాప్తంగా భీమ్‌ దీక్షలు నిర్వహించారు. తెలంగాణ సీఎంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
 
2022 సంవత్సరం ప్రారంభంలోనే బండి సంజయ్‌ అరెస్ట్‌ తెలంగాణలో బీజేపీ పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఉద్యోగులు ఉపాధ్యాయులు పక్షాన 317 జీవో సవరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయనను అరెస్టు చేశారు.
 
2022 సంవత్సరంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలోని అనేక సమస్యలపై పోరుబాట పట్టింది. బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్రలు, ప్రజాగోస బీజేపీ భరోసా బైక్‌ ర్యాలీలు, ప్రజా సమస్యలపై ఆందోళనలు, ధర్నాలు, దేశంలోని వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపీల లోక్‌సభ ప్రభాస్‌ యోజన కార్యక్రమం వెరసి బీజేపీ తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో 2022 సంవత్సరంలో సక్సెస్‌ అయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్విట్టర్‌పై హ్యాకింగ్ పంజా ... అంగట్లో 40 కోట్ల ట్విట్టర్ యూజర్ల వివరాలు