Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు కారుపై బాంబుతో దాడిచేస్తాం : వైకాపా నేత

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (16:31 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం వస్తే ఆయన కారుపై బాంబుతో దాడి చేస్తామంటూ వైకాపా నేత, రెస్కో చైర్మన్‌ జీఎస్‌ సెంథిల్‌కుమార్‌ హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న విషయంతెల్సిందే. ఒకరు ఒక మాటంటే.. తామేం వాళ్లకు తక్కువేం కాదని రెచ్చిపోయి మరీ ఇష్టానుసారం మాట్లాడేస్తున్నారు. 
 
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష చేపట్టగా దీనికి పోటీగా వైసీపీ జనాగ్రహ దీక్ష చేపట్టింది. దీక్షాస్థలి నుంచి కూడా అటు టీడీపీ నేతలు ఇటు వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. దీంతో ఎవరేం మాట్లాడుతున్నారో తెలియక ఆయా పార్టీల కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.
 
ముఖ్యంగా, చిత్తూరు జిల్లాలో వైసీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలో చంద్రబాబుపై రెప్కో ఛైర్మన్ సెంథిల్ కుమార్ రెచ్చిపోయారు. బూతు పురాణం లంఘించారు. కుప్పం వస్తే కారు మీద బాంబు వేస్తా.. దమ్ముంటే కుప్పంకి రా రా... అంటూ హెచ్చరించారు. 
 
ఎంపీ రెడ్డెప్ప సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సెంథిల్ మాట్లాడుతున్నంత సేపు రెడ్డెప్ప సహా ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయన్ను ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. అంతేకాదు ఇంకా చాలా బూతులే సెంథిల్ మాట్లాడారు. ఇన్నేసి మాటలు మాట్లాడినప్పటికీ స్టేజ్‌పై ఉన్న నేతలంతా ఆయన్ను ఎంకరేజ్ చేశారో కానీ ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం