Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఓ మానసిక రోగి : ప్రజలను కంటికి రెప్పలా సీఎం జగన్ : జోగి రమేష్

Webdunia
శనివారం, 9 జనవరి 2021 (19:51 IST)
మానసిక రోగంతో చంద్రబాబు బాధపడుతూ, ఒక రాజకీయ ఉన్మాదిలా, ఉగ్రవాదిలా తయారై, వెంటిలేటర్‌ మీద, చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న టీడీపీని బతికించుకునేందుకు రకరకాల పన్నాగాలు, కుట్రలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. 
 
ఒక మానసిక రోగి వాడే భాషను చంద్రబాబు మాట్లాడుతూ తద్వారా సీఎం జగన్ మీద ప్రతిరోజూ అభూతకల్పనలతో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చటానికి చంద్రబాబు పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదని జోగి తెలిపారు. నిన్నటి దాకా అమరావతి.. అమరావతి అంటూ ఏడాదిపాటు అదేపనిగా పెయిడ్ ఆర్టిస్టులతో, పెయిడ్ కథనాలతో, పెయిడ్ మీడియా ఛానల్స్‌తో ఏడాది పాటు అమరావతిని సమస్యగా చంద్రబాబు చిత్రీకరించి చూపించారు. అమరావతి సినిమా విషయంలో చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అయిపోయారని జోగి రమేష్ తెలిపారు. 
 
కొత్త సంవత్సరం, క్రిస్మస్‌, సంక్రాంతి వేడుకల శుభ సందర్భంగా.. 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఇళ్ల పట్టాల పండుగ తేవడంతో.. ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్న శుభతరుణం ఇదని జోగి తెలిపారు. పేదలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చి.. రూ.1.80 లక్షలతో ఇళ్లు నిర్మించి ప్రభుత్వం ఇస్తోందని, దీనినుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న ఆలోచనతోనే చంద్రబాబు మతాన్ని రాజకీయంగా వాడుకోవటానికి కుట్ర పన్నారని జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అంతేకాకుండా చంద్రబాబు కూడా నేరుగా ఈ కుట్రలో భాగస్వామి అయ్యాడని మతం పేరుతో ఉన్మాదిలా, ఉగ్రవాదిలా ప్రభుత్వంపై నిందలు వేసే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని జోగి మండిపడ్డారు. ఇన్ని లక్షల మంది అక్కచెల్లెమ్మల సొంతింటి కల నిజం చేసుకోబోతుంటే ఎందుకు చంద్రబాబు మతం పేరుతో సీఎం శ్రీ జగన్ గారిపై నిందలు వేస్తున్నారని ప్రదర్శిస్తున్నారని జోగి రమేష్ ప్రశ్నించారు. 
 
రాష్ట్రంలో ప్రతిపక్షం పనికిరాని పక్షంగా వ్యవహరిస్తోంది. ప్రజాసమస్యలు ఏవైనా ఉంటే వాటితో ముందుకు రావాలని, ప్రజా సమస్యలేవీ లేకపోవడంతో ఇటువంటి మతపరమైన రాజకీయాలు చేసి ప్రజల్లో చిచ్చు పెట్టాలని చంద్రబాబు కుట్రలకు తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, ఆసరా గానీ, ఇళ్ల స్థలాలు గానీ ఎవరికైనా రాకపోతే చెప్పమని సీఎం జగన్ సూచిస్తున్నారని జోగి రమేష్ అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కచోట ప్రజాసమస్యలు లేవు. గ్రామాల్లో బ్రహ్మాండంగా ఈరోజు ఇళ్ల పట్టాల సంబరాలు జరుగుతున్నాయి. ఈ రోజు మతాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఒక మత చిచ్చును ప్రేరేపిస్తున్న చంద్రబాబును ఏం చేయాలి అని జోగి రమేశ్‌ నిలదీశారు. 
 
అసలు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉనికి ఉందా? కరోనా వచ్చిందని 9 నెలల క్రితం రాష్ట్రాన్ని, ప్రజల్ని వదిలి చంద్రబాబు, నారా లోకేశ్‌ పారిపోయారు. తగుదునమ్మా అంటూ.. చంద్రబాబు, లోకేశ్ లు వచ్చి మతం పేరుతో చిచ్చుపెట్టే కార్యక్రమానికి తెరదీశారని జోగి మండిపడ్డారు. 
 
మానవత్వం ఉన్న వ్యక్తి సీఎం జగన్‌ అని జోగి రమేష్ అన్నారు. కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, రంగు లేదు, ప్రభుత్వం అజెండా ఒక్కటే..  ఏ పార్టీ వారైనా కూడా పేదలైతే చాలు సంక్షేమ పథకాలకు ఇస్తున్నారు. అటువంటి సీఎం జగన్‌ మీద మతం ముద్ర వేయాలని చంద్రబాబు చూడటం ఏంటని జోగి ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కంటికి రెప్పలా సీఎం శ్రీ జగన్ కాపాడుతున్నారు. 
 
కరోనా సమయంలో 9 నెలల్లో ప్రతి గడపకు ఆరోగ్య రక్షణతో పాటు, ప్రతి నిత్యం ప్రజలకు ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా ప్రజల్ని సీఎం కాపాడారు. హైదరాబాద్ పారిపోయిన చంద్రబాబు ఇప్పుడు వచ్చి మత పిచ్చితో మాట్లాడటం ఏంటి? ఆలయాల ఘటనలో సిట్ ఎంక్వైరీకి సీఎం జగన్ ఆదేశించారని జోగి గుర్తు చేశారు. దేవాలయాలపై దాడి చేసిన దుర్మార్గులను అరెస్ట్ చేసి శిక్షిస్తామని జోగి రమేష్‌ స్పష్టం చేశారు. 
 
టీడీపీ అధికారంలోకి వస్తే పోలీసుల సంగతి చూస్తారట. పోలీసుల్ని నక్సలైట్ల ఏరియాల్లో వేస్తామని టీడీపీ నేత దేవినేని ఉమా బెదిరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి ఎప్పుడు వస్తుంది, టీడీపీ నరకంలో పాలన చేయటం తప్ప రాష్ట్రంలో పాలన చేయలేదని రాష్ట్రంలో తెలుగుదేశం పని అయిపోయిందని జోగి రమేష్‌ అన్నారు. చంద్రబాబు చేసిన పాపాలకు నరకానికే పోతారని జోగి తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ అడ్రస్ గల్లంతై పోయిందన్నారు. 
 
దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, అశోక్‌బాబు లాంటి పనికిమాలిన నాయకులు ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి రెండో, మూడో సమావేశాలు పెట్టడం తప్ప ప్రజల్లో అసలు  మీరు ఉన్నారా? టీడీపీ ఉందా.. ప్రజల పక్షాన ప్రతిపక్షం ఉన్నదా? ప్రతిపక్షం పనికిరాని పక్షంగా మారిపోయిందని జోగి రమేష్ అన్నారు. అసలు ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలు కోల్పోయారని జోగి రమేష్‌ అన్నారు.
 
 
 
వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని, 18 నెలల కాలంలోనే 90% నెరవేర్చిన గొప్ప వ్యక్తి సీఎం శ్రీ జగన్ మోహన్ రెడ్డి. ఈరోజు ప్రతిపక్షం అది చేస్తాం.. ఇది చేస్తామని చెప్పటం ఏంటి? అసలు టీడీపీ ఏం చేయగలదు? రెండు, మూడుసార్లు మీడియా సమావేశాలు పెట్టి అవి తమ అనుకూల మీడియాలో రాయించుకొని, మళ్లీ వాటిపై టీవీ ఛానళ్ళలో చర్చించటం తప్ప టీడీపీ నేతలు చేసేది ఏమైనా ఉందా అని అని జోగి రమేష్‌ నిలదీశారు. 
 
దేవినేని ఉమా రోజూ రంకెలు వేస్తున్నారు, వాటిని దేవినేని కుటుంబ సభ్యులే అసహ్యించుకుంటున్నారు. మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో వెళ్ళి చూడండి. ఎన్ని వేల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామో చూడండి. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు. ఏనాడైనా ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబుకు కలిగిందా అని జోగి రమేష్‌ ప్రశ్నించారు. 
 
 
దేశ చరిత్రలోనే ఒకే ఒక్కసారి 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం శ్రీ వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి గారిదే అని జోగి రమేష్‌ స్పష్టం చేశారు. ఆ 31 లక్షల మందిలో 90% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారని జోగి రమేష్ తెలిపారు. మా వర్గాలకు మేలు చేస్తే తప్పా? పేదలు బాగుపడితే టీడీపీ నేతలకు ఎందుకు అంత కడుపుమంటని జోగి మండిపడ్డారు. ఉగాది నాడు ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలను కోర్టులకు వెళ్లి 9నెలలు వాయిదా వేయించింది చంద్రబాబు కాదా అని జోగి రమేష్‌ ప్రశ్నించారు.
 
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు అందరికీ చేరాలని, ప్రతి 50 మంది ఇళ్లకు ఒక వాలంటీర్‌ను పెట్టి కంటికి రెప్పలా ప్రజల్ని సీఎం కాపాడుతున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని సీఎంపైనా, ప్రభుత్వంపైనా నిందలు వేయాలని టీడీపీ చేస్తున్న పన్నాగాలను అరికడుతున్నామన్నారు. ఇప్పటికే చంద్రబాబుకు దేవుడు తగిన శాస్తి చేశారని, గట్టిగా గుణపాఠం చెప్పారన్నారు. సీఎం శ్రీ జగన్ గారిపై చంద్రబాబు నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోమని జోగి రమేష్‌ హెచ్చరించారు. 
 
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధి కోసం పనిచేస్తున్న మా నాయకుడు శ్రీ జగన్ గారిపై టీడీపీ నాయకులు వాడుతున్న భాష అభ్యంతరకరమైందని జోగి మండిపడ్డారు. చూస్తూ ఊరుకుంటున్నామని అనుకోవద్దు.. ప్రజలు కూడా మీ భాషను గమనిస్తున్నారు, ఇలాంటి భాషనే మళ్లీ టీడీపీ నేతలు మాట్లాడితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా తిరుగుబాటు చేస్తారు. ఇప్పటికే 9 నెలలు కరోనా పేరుతో చంద్రబాబు, లోకేశ్ రాష్ట్రం విడిచి వెళ్లిపోయారు. మళ్లీ నోరు పారేసుకుంటే చంద్రబాబు, లోకేశ్‌లను రాష్ట్రం నుంచి తరిమి తరిమికొట్టేలా అందరం సంఘటితం అవుతామని జోగి హెచ్చరించారు. 
 
మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
 ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యం కాదు. వ్యాక్సిన్ కావాలి, ప్రజల ప్రాణాలు నిలపాలి. వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. అది వేసుకుంటే మన ప్రాణానికి భద్రత ఉంటుందని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఇంత అర్జంటుగా ఎన్నికలు పెట్టాలని ప్రజలు ఎదురు చూడటం లేదు. ప్రభుత్వ ప్రతినిధులు అంతా వ్యాక్సిన్ అందజేసే ప్రక్రియలోనే నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించటం సాధ్యం కాదని సీఎస్‌, హెల్త్‌ సెక్రటరీ చెప్పారని జోగి రమేష్‌ గర్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments