Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు వ్యాపారులకు రూ.10వేల చొప్పున సున్నావడ్డీ రుణాలు

Webdunia
గురువారం, 21 జులై 2022 (16:33 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్ధమైంది. ఇప్పటికే పలు పథకాలను అమలు చేసిన ప్రభుత్వం అదే కోవలో మరో పథకాన్ని ప్రజలకు అందించనుంది. 
 
తోపుడుబండ్లు, చిన్నచిన్న షాపుల ద్వారా వ్యాపారం చేసుకునేవారి కోసం జగనన్న తోడు పేరుతో వడ్డీలేని రుణాలను అందిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని లక్షలాది మంది చిరు వ్యాపారులకు రూ.10వేల చొప్పున సున్నావడ్డీ రుణాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.
 
ఈనెల 26న లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో దీనికి సంబంధించిన కసరత్తు జరగుతోంది. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది ప్రభుత్వం. ఆ తర్వత గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిన అనంతరం మండల స్థాయి అధికారులకు ఆ తర్వాత జిల్లా కలెక్టర్లకు చేరుతోంది.
 
జగనన్న తోడు పథకం కింద రుణం పొందిన వారు నెలసరివాయిదాల్లో నగదును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తైంది. ఈ ఏడాది మొదట్లో ఈ పథకం కోసం వివరాలు సేకరించినా పథకం అమలు ఆలస్యమైంది.
 
ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని పథకాల కోసం వివరాలు సేకరిస్తోంది. వైఎస్ఆర్ కాపునేస్తం కింద 45-60 ఏళ్ల మధ్య వయసున్న పేద కాపు మహిళలకు రూ.15వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. దీంతో పాటు వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద చేనేత కుటుంబాలకు రూ.24వేల చొప్పున ఆర్ధిక సాయం చేయనుంది ఏపీ ప్రభుత్వం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments