Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడవాడలా వై.ఎస్.ఆర్ కి ఘన నివాళి... కాంగ్రెస్ వాళ్ళు కూడా...

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (15:32 IST)
ప్రజల గుండెల్లో ఇప్పటికి ఎప్పటికి గుర్తుండే నాయకుడు వైఎస్ఆర్. అందుకే ఆయ‌న‌కు వాడ‌వాడ‌లా ఘ‌న నివాళులు ప‌లికారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ వారు కూడా ఉన్నారు. విజ‌య‌వాడలోని ఆంధ్ర‌ర‌త్న భ‌వ‌న్లో మాజీ సీఎం వై.ఎస్. ఆర్. చిత్ర‌ప‌టానికి జిల్లా కాంగ్రెస్ నాయ‌కులు పూల మాల వేసి నివాళులు అర్పించారు. న‌ర‌సింహారావు, రాజీవ్ ర‌త‌న్ లు వై.ఎస్. గొప్ప‌త‌నాన్ని శ్లాఘించారు. 
 
మ‌రో ప‌క్క, బడుగు, బలహీన వర్గాల వారు ఆయన అందించిన సంక్షేమ పథకాలను స్మరించుకుంటున్నారని రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు , వయోవృద్ధుల, దివ్యంగుల సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. గురువారం ఉదయం కొవ్వూరు మెయిన్ రోడ్డు లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మంత్రి,  కొవ్వూరు మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 
 
అంతకుముందు మంత్రి తానేటి వనిత  క్యాంపు కార్యాలయంలో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి భోజన పేకట్లను పంపిణీ చేశారు. మంత్రి పర్యటనలో భాగంగా కొవ్వూరు వాటర్ ట్యాంక్ నందు గల,  విజయవిహార్ సెంటర్ లో గల వైస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి మంత్రి నివాళులు  అర్పించారు. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఫ్రూట్స్ పంపిణీ ,  వాత్స్యల్య వృద్ధాశ్రమం నందు వృద్ధులకు పళ్ళు పంపిణీ , వస్త్ర దానం కార్యక్రమాలలో పాల్గొన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments