Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు నేనా.. అలీ-దివ్యవాణిల మధ్య మాటల యుద్ధం.. ఇంతకీ ప్యాకేజీ ఎంత?

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (11:51 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం వాడీవేడీగా జరుగుతోంది. రాజకీయ నాయకులు నువ్వా నేనా అంటూ ప్రచారం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయవేత్తలకు తాము ఏమాత్రం తక్కువ కాదనే విధంగా సినీ నటులు కూడా తమ వంతుగా ఎన్నికల ప్రచారాన్ని రక్తికట్టిస్తున్నారు. 
 
ఇందులో భాగంగా.. కమెడియన్ అలీ, సినీనటి దివ్యవాణిల మధ్య వివాదం చోటుచేసుకుంది. అసలు విషయానికి వస్తే ఏపీలో పలు పార్టీలకు మద్దతుగా సినీ నటులు ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో టీడీపీ తరపున దివ్యవాణి, వైసీపీ తరపున అలీ కూడా ఉన్నారు. తాజాగా దివ్యవాణి మాట్లాడుతూ.. ప్యాకేజీ తీసుకుని వైసీపీలో అలీ చేరారంటూ విమర్శించారు. 
 
ఈ వ్యాఖ్యలపై అలీ కూడా అంతే ఘాటుగా స్పందించారు. ప్యాకేజీ తీసుకున్నట్టు మీరేమైనా చూశారా? లేక సెల్ఫీ తీశారా? అంటూ నిలదీశారు. టీడీపీలో చేరేందుకు మీరెంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. 
 
ముందు వెనకా ఆలోచించకుండా విమర్శలు చేయడం తగదన్నారు. కాగా, పెళ్లిపుస్తకం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దివ్యవాణి ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవలే అలీ కూడా వైకాపా చీఫ్ జగన్ సమక్షంలో వైకాపాలోకి చేరిన సంగతి విదితమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments