Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో మండిపోతున్న ఎండలు

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (11:21 IST)
తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం తీవ్రంగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో పగటిపూట బయటకు రావాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో కంటే ఈ వేసవిలో సాధారణ స్థాయి కంటే మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 
 
ఈ క్రమంలో వరుసగా నాలుగు రోజుల నుంచి 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. పగటి సమయంలో ఇలావుంటే ఇక రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 26 డిగ్రీలుగా ఉండటంతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. 
 
ముఖ్యంగా, మైత్రివనం, శ్రీనగర్‌కాలనీ, గోల్కొండ, అంబర్‌పేట, జూబ్లీహిల్స్‌, మణికొండ, మాదాపూర్‌, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో 41-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మంగళవారం (ఏప్రిల్ 2) హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా సగటు గరిష్టంగా ఉష్ణోగ్రత 40.4, కనిష్టంగా 26.3 డిగ్రీలుగా నమోదయ్యాయి. 
 
ఏప్రిల్ నెలలోనే తీవ్రమైన ఎండ, వడగాల్పుల కారణంగా రోడ్లపై ట్రాఫిక్‌ అంతంతమాత్రంగానే ఉంటుండగా.. మధ్యాహ్నం 12-3 గంటల మధ్య రోడ్లు బోసిపోతున్నాయి. ఈ క్రమంలో మరో రెండురోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇవే స్థాయిలో కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments