Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు వైఎస్ఆర్ జయంతి : ఇడుపులపాయలో వైఎస్ ఫ్యామిలీ నివాళులు

Webdunia
గురువారం, 8 జులై 2021 (09:01 IST)
దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపాయలోని వైఎస్ ఘాట్ వద్ద కూతురు షర్మిల, భార్య విజయమ్మ నివాళులర్పించారు. షర్మిల వెంట వైఎస్ వివేకా కమార్తె సునీత వైఎస్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. అలాగే, కడప ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానంలో షర్మిల హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. 
 
తెలంగాణలో షర్మిల పార్టీ ఆవిర్భావానికి అంతా సిద్ధమైంది. తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతిని పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్లో షర్మిల తన పార్టీ పేరును ప్రకటించనున్నారు. 
 
షర్మిల పెట్టబోయే పార్టీ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్న సంగతి తెలిసిందే. పార్టీ పేరును ప్రకటించడంతో పాటు పార్టీ జెండానూ షర్మిల ఆవిష్కరించనున్నారు. 
 
మరోవైపు, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా తొలిసారిగా సీఎం జగన్ సాయంత్రం వేళలో ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. 
 
అయితే ఇలా చేయడం సాంప్రదాయాలు, ఆచారాలకు విరుద్ధమని పెద్దలు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ జయంతి వేడుకల్లో  సమయవేళ మార్పు కోసం అన్నాచెల్లెల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. షర్మిళ ఉదయం సమయం మార్పు కోసం ఒప్పుకోకపోవడంతోనే సీఎం జగన్ సాయంత్రం షెడ్యూల్‌ను ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments