Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది మేమే : అప్రూవర్ దస్తగిరి

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (14:01 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డిని హత్య చేసింది తామేనని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి అప్రూవర్‌గా మారిన వివేకా వ్యక్తిగత కారు మాజీ డ్రైవర్ దస్తగిరి తెలిపారు. ఇపుడు తనకు ప్రాణహాని నెలకొందని, తనకు ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వివేకాను హత్య కేసులో తాను అప్రూవర్‌గా మారినప్పటి నుంచి ప్రాణహాని నెలకొందన్నారు. ఇటీవలే తన పెంపుడు కుక్కను కూడా చంపేశారనీ, తనను ఏ క్షణమైనా హత్య చేయొచ్చని ఆయన భయం వ్యక్తం చేశారు. 
 
తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతుందన్నారు. ఈ క్రమంలో త‌న ప్రాణాల‌కు ఏదైనా హాని జ‌రిగితే సీఎం జ‌గ‌న్‌దే బాధ్య‌త అని పేర్కొన్నాడు. ప్ర‌భుత్వ అధికారులు సీఎం జ‌గ‌న్ చెప్పిన మాటే వింటారు కాబ‌ట్టే త‌న ర‌క్ష‌ణ బాధ్య‌త జ‌గ‌న్‌దేన‌ని అంటున్నాన‌న్నాడు. 
 
అవినాశ్ రెడ్డి, భాస్క‌ర్ రెడ్డి, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంద‌రూ ఒకే కుటుంబ స‌భ్యుల‌ని తెలిపాడు. త‌న‌ను ఏమైనా చేస్తారేమోన‌నే భ‌యం త‌న‌ను వెంటాడుతోంద‌న్నాడు. పెద్ద‌వాళ్ల‌నే కీలు బొమ్మ‌లుగా చేసి ఆడిస్తున్న కొంద‌రికి తానో లెక్క కాద‌న్నాడు. 
 
త‌న‌కు ప్రాణ భ‌యం ఉంద‌న్న ద‌స్త‌గిరి... త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరాడు. త‌న‌కు కేటాయించిన గ‌న్‌మ‌న్ల‌ను ఎందుకు మార్చార‌ని మాత్ర‌మే ఎస్పీకి ఫిర్యాదు చేశానన్న ద‌స్త‌గిరి...తాను చేసిన వ్యాఖ్య‌ల‌న్నీ అస‌త్యాల‌ని ఎస్పీ చెప్ప‌డం బాధాక‌ర‌మ‌న్నాడు. స‌మస్య త‌న‌ద‌ని, ఎలాంటి కుట్ర జ‌రుగుతుందో త‌న‌కే తెలుసున‌ని కూడా ద‌స్త‌గిరి వ్యాఖ్యానించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

దేవీశ్రీ ప్రసాద్ లేనిదే నా జర్నీ శూన్యం - నా లైఫ్ మార్చింది ఆ దర్శకుడే : తేల్చిచెప్పిన అల్లు అర్జున్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments