Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన పుట్టుకనే శంకించారు... వైఎస్ఆర్‌కు పుట్టలేదంటూ ప్రచారం.. వైఎస్ షర్మిల

Sharmila
ఠాగూర్
శుక్రవారం, 8 నవంబరు 2024 (09:23 IST)
వైకాపా సైకో సోషల్ మీడియాపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పుట్టుకనే శంకించారని, తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారంటూ పేర్కొన్నారు. ఇదే అంశంపై ఆమె తన ట్విట్టర్ హ్యండిల్‌లో ఓ పోస్టు చేశారు. 
 
"సమాజానికి మంచి చేసేది సోషల్ మీడియా. అలాంటి వ్యవస్థను కొంతమంది సైకోలు, సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం నీచం లేకుండా భ్రష్టు పట్టించారు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాల లెక్క మారారు. మహిళలు అనే జ్ఞానం లేకుండా ఇంట్లో తల్లి, అక్కా, చెల్లి కూడా సాటి మహిళా అనే ఇంగితం లేకుండా, రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులతో, వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందారు. సోషల్ సైకోల బాధితుల్లో నేను ఒకరిగా చెప్తున్నాను... 
 
అసభ్యకర పోస్టులతో ప్రతిష్ట దెబ్బతినేలా పోస్టులు పెట్టీ.. పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠినంగా చర్యలు ఉండాలి. నా మీద, అమ్మ మీద, సునీత మీద విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదని అవమానించారు. నా ఇంటి పేరు మార్చి శునకానందం పొందారు. నాపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై నేను కూడా పోలీస్ కేసు పెట్టాను. అటువంటి సైకో అరెస్టును స్వాగతిస్తున్నాం .
 
అరాచక పోస్టులు పెట్టే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం. మరోసారి సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హాననానికి పాల్పడాలంటే భయపడేలా అనునిత్యం చర్యలు కొనసాగాలని కూటమి ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments