Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వర్రా రవీందర్ రెడ్డి వంటి సైకో అరెస్టును స్వాగతిస్తున్నా: ఏపి పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల

Advertiesment
Sharmila

ఐవీఆర్

, గురువారం, 7 నవంబరు 2024 (18:40 IST)
సోషల్ మీడియాలో అసభ్య పదజాలాన్ని ఉపయోస్తూ, రాయలేని భాషలో పోస్టులు పెట్టి తీవ్రమైన మనోవేదనకు గురిచేసే సైకోల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఆమె తన ట్విట్టర్ పేజీలో ఈ మేరకు పోస్ట్ పెట్టారు.
 
''సమాజానికి మంచి చేసేది సోషల్ మీడియా. అలాంటి వ్యవస్థను కొంతమంది సైకోలు, సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం నీచం లేకుండా భ్రష్టు పట్టించారు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాల లెక్క మారారు. మహిళలు అనే జ్ఞానం లేకుండా ఇంట్లో తల్లి, అక్కా, చెల్లి కూడా సాటి మహిళా అనే ఇంగితం లేకుండా, రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులతో, వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందారు. సోషల్ సైకోల బాధితుల్లో నేను ఒకరిగా చెప్తున్నాను. 
 
అసభ్యకర పోస్టులతో ప్రతిష్ట దెబ్బతినేలా పోస్టులు పెట్టీ.. పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠినంగా చర్యలు ఉండాలి. నా మీద, అమ్మ మీద, సునీత మీద విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికే పుట్టలేదని అవమానించారు. నా ఇంటి పేరు మార్చి శునకానందం పొందారు. నాపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై నేను కూడా పోలీస్ కేసు పెట్టాను. అటువంటి సైకో అరెస్టును స్వాగతిస్తున్నాం.
 
అరాచక పోస్టులు పెట్టే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం. మరోసారి సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హాననానికి పాల్పడాలంటే భయపడేలా అనునిత్యం చర్యలు కొనసాగాలని కూటమి @JaiTDP వారిని @JanaSenaParty వారిని @BJP4Andhra ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.'' అని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాలంటీర్లను గత వైసిపి ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది: పవన్ కల్యాణ్