కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనంకానుంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇదే విషయంపై ఆమె పార్టీ ముఖ్యనేతలతో మంగళవారం సమావేశమయ్యారు. ఇందులో కాంగ్రెస్ పార్టీలో విలీనం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమావేశం తర్వాత మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆమె కడపకు బయలుదేరి వెళతారు.
ఈ సమావేశం తర్వాత తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అంశంపై ఆమె కీలక ప్రకటన చేస్తారు. అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు ఆమె ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నగరం నుంచి కడపకు బయలుదేరి వెళతారు. కడప ఎయిర్ పోర్టు నుంచి ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి వైఎస్ఆర్ సమాధికి నివాళులు అర్పిస్తారు. తన కుమారుడు వివాహం సందర్భంగా తండ్రి ఆశీర్వాదం తీసుకుంటారు. కాబోయే వధూరులు రాజారెడ్డి, ప్రియ కూడా షర్మిలతో పాటు ఇడుపులపాయ వెళ్లనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంపై షర్మిల మాట్లాడుతూ కేసీఆర్ 9 యేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకోయారని విమర్శించారు. అందుకనే మళ్లీ అధికారంలోకి రాకూడదని కోరుకున్నట్టు తెలిపారు. తాను పోటీ చేస్తే 55 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపుతుందని, అదే జరిగితే తిరిగి బీఎస్ఆర్ అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ మద్దతు ప్రకటించినట్టు తెలిపారు. కాగా, షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారన్న వార్త ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హీట్ పెంచింది.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ న ప్రియుడిని వివాహమాడనుంది. ఆమె ప్రియుడు బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారు. వీరి పెళ్లి గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. అయితే.. సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటామని గతంలో రకుల్ స్పష్టతనిచ్చారు.
ఈ నేపథ్యంలో ఈ యేడాది ఫిబ్రవరి 22వ తేదీన గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో వీరి పెళ్లి జరగనుందంటూ పలు ఆంగ్ల వెబ్‌సైట్స్‌లో కథనాలు వచ్చాయి. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుందని, ఆ తర్వాత సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా విందు ఇవ్వనున్నారని ఆయా వార్తల్లోని సారాంశం. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట వైరల్‌గా మారడంతో సినీ ప్రియులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
కాగా, రకుల్ ప్రీత్ సంగ్ 'గిల్లి' అనే కన్నడ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చారు. 2013లో విడుదలైన తెలుగు చిత్రం 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు వరుస కట్టాయి.
ప్రస్తుతం ఆమె తెలుగుతోపాటు బాలీవుడ్‌లోనూ నటిగా రాణిస్తున్నారు. ఆమె నటించిన 'అయాలన్' సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. బీటౌన్ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో తాను రిలేషన్‌లో ఉన్నానంటూ 2021లో ఆమె ప్రకటించారు.