సజ్జల.. ఒక మూర్ఖుడిలా మాట్లాడారు... జగన్ సొంత చెల్లికే మర్యాద లేదు : వైఎస్ షర్మిల

ఠాగూర్
మంగళవారం, 10 జూన్ 2025 (16:19 IST)
వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి ఏపీ పీసీసీ చీప్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఓ మూర్ఖుడులా మాట్లాడారన్నారు. వైకాపా నేతలకు మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదని మండిపడ్డారు. ఆమె మంగళవారం అన్నమయ్య జిల్లా రాయచోటిలో విలేకరులతో మాట్లాడుతూ, మహిళను కించపరుస్తూ సజ్జల ఒక మూర్ఖుడిలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తోందన్నారు. 
 
సజ్జల కుమారుడు భార్గవ రెడ్డి సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని తనపై కూడా దుష్ప్రచారం చేశారు. వైఎస్ కుమార్తె, ఒక మహిళ అని కూడా చూడకుండా కించపరిచారు. జగన్ అందరినీ నా అక్క చెల్లెళ్లు అని అంటారు. కానీ, ఆయన సొంత చెల్లికే మర్యాద లేదు. ఇక రాష్ట్రంలోని మహిళలను ఏం గౌరవిస్తారు అంటూ షర్మిల సూటిగా ప్రశ్నించారు. 
 
ఇకపోతే, తమ పార్టీలో కొందరి తీరు ఏమాత్రం బాగోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రమన్నారు. అందులో మంచితో పాటు చెత్త కూడా ఉంటుందన్నారు. పార్టీ అభివృద్ధి చెందుతుంటే కిందకు లాగేవారు ఉంటారన్నారు. వారే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. పార్టీకి క్రమశిక్షణ కమిటి ఉందని, అలాంటి వారిలో ఆ కమిటి తగిన చర్యలు తీసుకుంటుందని, పార్టీలో ఉంటూ పార్టీని విమర్శించే వారిని ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

మరువ తరమా సినిమా పెద్ద విజయం సాధించాలి : రఘు రామ కృష్ణరాజు

Andhra King Taluka Review: అభిమానులకు స్పూర్తినిచ్చేలా ఆంధ్ర కింగ్ తాలూకా.. మూవీ రివ్యూ

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments