వాలెంటైన్ డే నాడు వైఎస్ జ‌గ‌న్ నూత‌న గృహ ప్ర‌వేశానికి ముహుర్తం

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (11:01 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో అమ‌రావ‌తి నుంచే పార్టీని న‌డిపించాల‌ని.. ప్ర‌చారాన్ని ప్రారంభించాల‌ని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. తాడేప‌ల్లిలో నిర్మించిన వై.ఎస్.జ‌గ‌న్ నూత‌న గృహాన్ని ప్రారంభించేందుకు ముహుర్తం ఖ‌రారు చేసారు. ఫిబ్ర‌వ‌రి 14వ తేదీ ఉద‌యం 8 గంట‌ల 21 నిమిషాల‌కు ఆయ‌న గృహ ప్ర‌వేశం చేయ‌నున్నారు. పాద‌యాత్ర త‌ర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప‌ర్య‌ట‌న‌లు చేయాల‌ని ప్లాన్ చేసుకున్నారు.
 
అయితే... హైద‌రాబాద్‌లో నివాసం ఉంటే ప్ర‌యాణాల‌కు ఎక్కువ టైమ్ ప‌డుతుంద‌ని.. అదీ కాకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌ధానిలో త‌న నివాసం ఉంటే ఏపీ ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌గా ఉండ‌చ్చు అనే ఉద్దేశ్యంతో ఈ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జగన్ నివాసానికి సమీపంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించారు. దాని నిర్మాణం కూడా పూర్తయింది. 
 
ఇక త్వరలోనే వైసీపీ పూర్తి యంత్రాంగం అమరావతికి మారుతుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. గృహ ప్ర‌వేశానికి ఫ్యామిలీ మెంబ‌ర్స్, కొంద‌రు ముఖ్య అతిధులు మాత్ర‌మే హాజ‌ర‌వుతార‌ని..అదే రోజున జరిగే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వైసీపీ శ్రేణులంతా హాజరవుతారని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments