Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబుకు వచ్చిన కరోనా తగ్గిపోతుంది.. ఎన్టీఆర్‌కు పొడిచిన వెన్నుపోటు మాత్రం...

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (12:41 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు కరోనా వైరస్ సోకింది. దీనిపై వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కాస్త వ్యంగ్యంగా స్పందించారు. చంద్రబాబుకు సోకిన కరోనా వైరస్ తగ్గిపోతుందన్నారు. కానీ, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుకు పొడిచిన వెన్నుపోటు మాత్రం తెలుగు జాతి ఉన్నంతవరకు గుర్తుండిపోతుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
అలాగే, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు ఓ ట్వీట్ చేశారు. వీరిద్దరూ వేర్వేరుగా ప్రకటనలు చేశారు. 
 
చంద్రబాబు నాయుడుకి కరోనా పాజిటివ్ 
 
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కరోనా వైరస్ సోకింది. తాను కోవిడ్ బారినపడినట్టు బాబు స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు ప్రకటించారు. అలాగే, ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకుని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. 
 
కాగా, చంద్రబాబు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. ఆ తర్వాత గుంటూరు జిల్లా కారంచేడులో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త అంతిమ యాత్రలో పాల్గొని పాడె కూడా మోసారు. అలాగే, మరికొన్ని ప్రజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. 
 
ఇదిలావుంటే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని ఆయన సోమవారం వెల్లడించి, ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments