Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా కలకలం - 50 మందికి పాజిటివ్

Advertiesment
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా కలకలం - 50 మందికి పాజిటివ్
, మంగళవారం, 18 జనవరి 2022 (11:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య రాజధానిగా ఉన్న విజయవాడ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా కలకలం చెలరేగింది. మొత్తం 50 మందికి కరోనా వైరస్ సోకింది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో సహా మొత్తం 25 మంది వైద్యులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ఈ వైరస్ బారినపడినవారిలో ఉన్నారు. ఆస్పత్రిలో పని చేసే వైద్యులకు ఈ వైరస్ సోకడతం రోగులతో పాటు.. వారి బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 
 
దేవినేని ఉమకు పాజిటివ్
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా వెల్లడించారు. "వైద్యుల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నా. కొన్ని రోజులుగా తనను కలిసివారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను" అని పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కూడా కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. తాను కోవిడ్ బారినపడినట్టు బాబు స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు ప్రకటించారు. అలాగే, ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకుని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. 
 
కాగా, చంద్రబాబు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. ఆ తర్వాత గుంటూరు జిల్లా కారంచేడులో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త అంతిమ యాత్రలో పాల్గొని పాడె కూడా మోసారు. అలాగే, మరికొన్ని ప్రజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. 
 
ఇదిలావుంటే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని ఆయన సోమవారం వెల్లడించి, ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తగ్గుతున్న కరోనా - పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు