Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్త పెన్షన్లు.. 2020, జనవరి 1 నుంచి పంపిణీ

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (16:31 IST)
ఆంధ్రప్రదేశ్ కొత్త పెన్షన్లు కొత్త సంవత్సరంలో పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో అర్హత వున్న ప్రతి ఒక్కరికీ ఫించన్ అందజేసే దిశగా.. ''వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక'" పథకంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని సర్కారు నిర్ణయించింది.

ఈ మేరకు కొత్తగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్ల మంజూరు కోసం నవంబర్‌ 21 నుంచి నుంచి గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన కార్యక్రమం చేపట్టనుంది. నవంబర్ 25 వరకు వాలంటీర్లు ఇంటి వద్దకే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తారు. 
 
ప్రజలందరి సమక్షంలో డిసెంబర్‌ 1 నుంచి 14వ తేదీల మధ్య సోషల్‌ ఆడిట్‌ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నట్టు సెర్ప్‌ అధికారులు వెల్లడించారు. డిసెంబర్‌ 15న మంజూరు చేసిన తుది పింఛనుదారుల జాబితాను ప్రకటించి.. కొత్తగా పెన్షన్లు మంజూరైన వారికి 2020, జనవరి 1 నుంచి పంపిణీ చేయనున్నట్లు వివరించారు.
 
అంతేగాకుండా.. కొత్త పింఛనుదారుల దరఖాస్తుల స్వీకరణ, ఇప్పటికే పింఛను తీసుకుంటున్నవారి వెరిఫికేషన్‌ ప్రక్రియపై (నవంబర్‌ 5, 2019) నుంచి అధికారులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments