అమ్మ ఆశీర్వాదం... చెల్లికి వెళ్లొస్తానని చెప్పి జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి సోమవారం ప్రారంభించారు. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఆయన కడప జిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ నుంచి శ్ర
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి సోమవారం ప్రారంభించారు. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఆయన కడప జిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ఈ పాదయాత్ర సాగనుంది.
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు ఆయన ఈ పాదయాత్రకు శ్రీకారంచుట్టారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 180 రోజులు 3 వేల కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. ఈ యాత్ర ద్వారా 125 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల బాధలు ప్రత్యక్షంగా చూసి.. సుమారు 2 కోట్ల మందిని స్వయంగా కలుసుకుంటారు.
అంతకుముందు పులివెందులలోని తన నివాసంలో అమ్మ వైఎస్ విజయమ్మ ఆశీస్సులు తీసుకొని.. సోదరి షర్మిల, ఇతర కుటుంబసభ్యులకు వెళ్లొస్తానని చెప్పి.. వైఎస్‌ఆర్ ఘాట్‌కు బయలుదేరి అంజలి ఘటించారు.
ఆ తర్వాత ఉదయం 9.47 నిమిషాలకు వైఎస్‌ఆర్ ఘాట్ నుంచి పాదయాత్రను ప్రారంభించిన వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని సభా ప్రాంగణానికి చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.