టెక్సాస్‌ చర్చిలో కాల్పులు.. 26 మంది మృత్యువాత

అమెరికాలో మరో ఉన్మాది విరుచుకుపడ్డాడు. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 26 మంది మృత్యువాతపడ్డారు. ఈ దారుణం టెక్సాస్ రాష్ట్రం సదర్‌ల

Webdunia
సోమవారం, 6 నవంబరు 2017 (09:59 IST)
అమెరికాలో మరో ఉన్మాది విరుచుకుపడ్డాడు. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 26 మంది మృత్యువాతపడ్డారు. ఈ దారుణం టెక్సాస్ రాష్ట్రం సదర్‌ల్యాండ్ స్ప్రింగ్‌లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో జరిగింది. ఈ కాల్పుల్లో 28 మంది చనిపోగా, మరో 25 మందికిపైగా గాయపడ్డారు. 
 
ఆదివారం ఉదయం 11.30 నిమిషాలకు చర్చిలో ప్రార్థనల కోసం పెద్దసంఖ్యలో వచ్చిన వారిని ఆర్మీ దుస్తుల్లో వచ్చిన దుండగుడు లక్ష్యంగా చేసుకుని ఆటోమేటెడ్ మెషీన్‌గన్‌తో కాల్పులకు తెగబడ్డాడు. దీంతో చర్చిలో ప్రార్థనలు చేస్తున్నవారు హాహాకారాలు చేస్తూ తలోదిక్కుకు పరుగులు తీశారు. 
 
ఈ క్రమంలో తూటాలు తగిలి సుమారు 26 మంది నేలకూలారు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా ఉండటం కలచివేస్తోంది. ఈ ఘటనపై ఆసియా దేశాల పర్యటనలో ఉన్న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. జపాన్ నుంచే తాను పరిస్థితిని సమీక్షిస్తున్నానని తెలిపారు.
 
కాగా, అమెరికాలో వరుస కాల్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. సదర్ ల్యాండ్ స్ప్రింగ్ చర్చిలో దుండగుడి కాల్పులతో సెక్యూరిటీ హై అలర్ట్ అయింది. చర్చిలో గాయపడినవారిని పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అమెరికా అంతటా భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments