Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఇలాకాలో సీఎం జగన్ పర్యటన

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (12:09 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ గడ్డపై సీఎం జగన్ తొలిసారి అడుగుపెట్టారు. వైఎస్ఆర్ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమం కుప్పం వేదికగా జరుగుతుంది. అలాగే, ఈ నియోజకవర్గంలో రూ.66 కోట్ల వ్యయంతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు కూడా సీఎం జగన్ శంకుస్థాపనలు చేస్తారు. 
 
అంతకుముందు ఆయన విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి ఇతర వైకాపా నేతలు స్వాగతం పలికాలు. 
 
పైగా, ముఖ్యమంత్రి హోదాలో జగన్ కుప్పంకు విచ్చేయడం ఇదే తొలిసారి. నియోజకవర్గంలోని అనిమిగానిపల్లిలో వైఎస్సార్ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తారు. 
 
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత కుప్పం మున్సిపాలిటీకి సంబంధించిన రూ. 66 కోట్ల విలువైన పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. రూ.11 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తాడేపల్లికి తిరుగుపయనమవుతారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments