Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబును మించిన దుర్మార్గుడు లేడు.. వివేకాను చంపించింది.. ఆయనే?

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (11:56 IST)
ఏపీ సీఎం చంద్రబాబుపై వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సొంత మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. తన అధికారానికి అడ్డువస్తే ఎవరినైనా చంపించే వ్యక్తిత్వం చంద్రబాబుదని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వార్థం కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు దిగజారుతాడని జగన్ ఫైర్ అయ్యారు. 
 
బాబుకు ఓటేస్తే హత్యా రాజకీయాలకు ఓటేసినట్టేనన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపించింది చంద్రబాబేనని జగన్‌ ఆరోపించారు. ఇప్పుడు కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ విమర్శించారు. తప్పు చేయకుంటే, హత్య వెనుక చంద్రబాబు పాత్ర లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. 
 
చంద్రబాబు నేరగాడు కాబట్టే సీబీఐ విచారణకు జడుసుకుంటున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు నేరగాడు కాకపోతే హైదరాబాద్ నుంచి ఎందుకు పారిపోయి వస్తారని నిలదీశారు. తప్పు చేయకపోతే 19 కేసుల్లో స్టేలు ఎందుకు తెచ్చుకున్నారన్నారు. చంద్రబాబును మించిన దుర్మార్గుడు లేడని జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments