Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రతను తగ్గించారు.. భయంగా ఉంది.. కోర్టులో జగన్ పిటిషన్ :: నిజం లేదన్న ఏపీ పోలీస్ శాఖ!!

వరుణ్
మంగళవారం, 6 ఆగస్టు 2024 (10:21 IST)
తనకు కల్పిస్తూ వచ్చిన వ్యక్తిగత భద్రతను ఏపీ ప్రభుత్వం తగ్గించిందని, తాను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నపుడు కల్పించిన భద్రతను తనకు కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డ కోరారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏపీ పోలీస్ శాఖ స్పందించింది. 
 
ప్రస్తుతం ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతోందని, భద్రత తగ్గించారనే వాదనలో నిజం లేదని రాష్ట్ర పోలీసుశాఖ, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మాజీ సీఎం హోదాలో జగన్‌కు నిబంధనల మేరకే భద్రతా సిబ్బందిని కేటాయించామని పోలీసుశాఖ స్పష్టం చేసింది. చంద్రబాబు మాజీ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు అందించిన భద్రతనే ప్రస్తుతం జగన్‌కు కూడా కొనసాగిస్తున్నట్టు ఏపీ పోలీసుశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆ హోదాను బట్టి అదనంగా కల్పించిన భద్రతను మాత్రమే తగ్గించామని, ప్రస్తుతం మాజీ సీఎం కావడంతో ముఖ్యమంత్రి స్థాయి భద్రత కల్పించడం సాధ్యంకాదని ఏపీ పోలీసు వర్గాలు తేల్చి చెప్పాయి. కాగా జూన్ 3 నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో మాజీ సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
 
జగన్ భద్రతకు సంబంధించిన వివరాలను ఏపీ పోలీసు వర్గాలు పంచుకున్నాయి. ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారిని భద్రత ఇన్‌చార్జిగా నియమించామని చెప్పారు. ప్రస్తుతం జగన్‌కు  58 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామని, ఆయన ఇంటి వద్ద 10 మంది సాయుధ గార్డులు ఉంటున్నారని, షిఫ్టుకు ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు పీఎస్‌వోలు 24 గంటల పాటు భద్రత కల్పిస్తారని చెప్పారు. నిరంతరం అందుబాటులో ఉండేలా ఆరుగురు డ్రైవర్లను జగన్‌కు కేటాయించామని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments