Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మోమయ్యా అంటూ ఓ ఆట ఆడుకున్న టీడీపీ కార్యకర్తలు!! ... అసెంబ్లీ వెనుక గేటు నుంచి రాక!!

వరుణ్
శుక్రవారం, 21 జూన్ 2024 (15:15 IST)
వైకాపా అధినేత, ఏజీ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీడీపీ కార్యకర్తలు ఓ ఆట ఆడుకున్నారు. జగన్ మోమయ్య అంటూ ఆయన సమక్షంలోనే ట్రోల్స్ చేశారు. ఏపీలో కొత్త అసెంబ్లీ శుక్రవారం కొలువుదీరింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. సభలో ప్రమాణ స్వీకారం చేసేందుకు జగన్ అసెంబ్లీకి వచ్చారు. ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అక్షర క్రమంలోకాకుండా మంత్రుల తర్వాత జగన్‌కు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వాలన్న వైసీపీ అభ్యర్థనకు ముఖ్యంమత్రి, సభానేత నారా చంద్రబాబు నాయుడు పెద్ద మనసుతో అంగీకరించారు. దీంతో మంత్రుల ప్రమాణం ముగియగానే జగన్ ప్రమాణ స్వీకారం పూర్తిచేశారు.
 
అంతకుముందు వైసీపీ అభ్యర్థన మేరకు జగన్ కారును కూడా లోనికి అనుమతించారు. అయితే అందరిలా జగన్ అసెంబ్లీ ప్రాంగణం మెయిన్ గేటు నుంచి కాకుండా వెనకగేటు నుంచి రావడం చర్చనీయాంశమైంది. జగన్ గతంలో సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం మీదుగా సభకు వచ్చేవారు. అయితే, అమరావతి రైతుల నుంచి నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో జగన్ వేరే మార్గం నుంచి వచ్చినట్టు తెలిసింది. అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నప్పటికీ సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత జగన్ లోపలికి వెళ్లారు. 
 
తన ప్రమాణ స్వీకారానికి సమయం వచ్చినప్పుడు మాత్రమే సభలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం పూర్తిచేశారు. అంతకుముందు అసెంబ్లీ వద్దకు చేరుకున్న జగన్‌కు చేదు అనుభవం ఎదురైంది. జగన్ కారును చూసిన వెంటనే కొందరు 'జగన్ మోమయ్యా' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ సమయంలో కారు ముందు సీటులో కూర్చొనివున్న జగన్‌కు ఈ అరుపులు వినిపించలేదు. దీంతో ఆయన రెండు చేతులు జోడించి అభివాదం చేస్తూ ముందుకుసాగిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya: సూర్య రెట్రో చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో తీసుకువస్తోంది

ఆస్ట్రేలియాలో సెక్యురిటీ గార్డ్ కూడా బీఎండబ్ల్యూ ఉంటుంది : విరాజ్ రెడ్డి చీలం

Akshay Kumar : కన్నప్ప ఆఫర్ రెండు సార్లు తిరస్కరించాను.కానీ...: అక్షయ్ కుమార్

చరిత్ర సృష్టించి 13 వారాల పాటు ట్రెండ్ అయిన లక్కీ భాస్కర్ చిత్రం

కోలీవుడ్‌లో వరుస ఛాన్సులు దక్కించుకుంటున్న పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments