Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవ్వ కూడా రెండున్నరేళ్లు ఆగాలా? జగన్ హామీపై బిత్తరపోయిన జనం.. ''అమ్మా'' అని పిలిచినా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా వేంపల్లిలో జగన్ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. రెండో రోజు పాదయాత్రలో ఓ వృద్ధురాలికి హామీ ఇచ్చిన

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (11:54 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా వేంపల్లిలో జగన్ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. రెండో రోజు పాదయాత్రలో ఓ వృద్ధురాలికి హామీ ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఆ పార్టీ మహిళా నేత రోజా కూడా తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు. 
 
ఈ వీడియోలో వేంపల్లిలో జగన్ మాట్లాడుతున్న సమయంలో ఓ వృద్ధురాలు తన కష్టాలను జగన్‌కు వివరించింది. తినేందుకు తిండి, ఉండేందుకు నివాసం లేదని.. చాలా కష్టాలు పడుతున్నానని చెప్పింది. దీనికి స్పందించిన జగన్ రెండున్నరేళ్లు ఎలాగోలా భరిస్తే కష్టాలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చారు. దీంతో పార్టీ శ్రేణులు సహా వృద్ధురాలు కూడా షాక్ అయ్యారు. దీంతో వృద్ధురాలు నిరాశతో వెనుదిరిగింది. జగన్ సమాధానంతో పక్కనే ఉన్న నేతలు కూడా విస్తుపోయారు. 
 
దీంతో పక్కనే ఉన్న ఎంపీ అవినాష్ స్పందించి జగన్ చెవిలో ఏదో చెప్పారు. వెంటనే తేరుకున్న జగన్ నిరాశతో వెళ్లిపోతున్న వృద్ధురాలిని.. 'అమ్మా, అమ్మా అని పిలుస్తూ..  ఇబ్బంది పడుతున్నావ్ కాబట్టి.. పులివెందులలో ఉన్న మన వృద్ధాశ్రమానికి పంపిస్తానని, అవినాష్‌తో చెప్పిస్తానని తెలిపారు. అయినా జగన్ మాటలను వృద్ధురాలు ఏమాత్రం పట్టించుకోకుండా ఆ వృద్ధురాలు వెళ్ళిపోయింది. 
 
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆహారం లేకుండా, ఇళ్లు లేకుండా ఇబ్బంది పడుతున్న వృద్ధురాలికి సాయం చేయాలన్నా రెండున్నరేళ్లు ఆగాలని జగన్ చెప్పడం సబబు కాదంటున్నారు. జగన్‌కు రెండున్నరేళ్లు ఓపిక పట్టండి అనే మాట అలవాటైపోయిందని.. అందుకే సాయం కోసం వచ్చినోళ్లతోనూ జగన్ అదే మాట అంటున్నారని.. టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments