Webdunia - Bharat's app for daily news and videos

Install App

నివాసానికి భూమి పనికిరాదు... మున్ముందు అగ్నిగోళమే : స్టీఫెన్ హాకింగ్

మనిషి మనుగడ సాగించేందుకు భూమి పనికిరాదట. ఎందుకంటే భూమి అగ్నిగోళంగా మారిపోనుందట. అందుకే మరో గ్రహం కోసం శోధించాలని ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అంటున్నారు. వచ్చే 600 యేళ్ళలో భూమి అగ్నిగోళ

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (11:45 IST)
మనిషి మనుగడ సాగించేందుకు భూమి పనికిరాదట. ఎందుకంటే భూమి అగ్నిగోళంగా మారిపోనుందట. అందుకే మరో గ్రహం కోసం శోధించాలని ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అంటున్నారు. వచ్చే 600 యేళ్ళలో భూమి అగ్నిగోళంగా మారిపోతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్, జనాభా పెరుగుదల. అధిక విద్యుత్ వినియోగం, రేడియోధార్మికవంటి వాటివల్ల భూమి అగ్నిగోళంగా మండిపోతుందని ఆయన అంటున్నారు. 
 
చైనా రాజధాని బీజింగ్‌లో జరుగుతున్న సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ, రానున్న 600 సంవత్సరాల్లో భూమి అగ్నిగోళంలా మారిపోతుందన్నారు. జనాభా నియంత్రణ లేకపోవడంతో పాటు విచ్చలవిడి విద్యుత్‌ వినియోగం దీనికి కారణమన్నారు. తర్వాతి తరాలు కొన్ని లక్షల ఏళ్లపాటు జీవించాలంటే మనిషి మరో గ్రహానికి వెళ్లడం తప్పదని ఆయన సూచించారు. మరోగ్రహం అంటే సౌరకుటుంబం అవతల భూమిని పోలిఉన్న మరో గ్రహాన్ని వెతుక్కోవాల్సి ఉంటుందన్నారు. సౌరకుటుంబానికి చేరువలో ఆల్ఫా సెంటారీ అనే నక్షత్ర సముదాయం ఉందని, అందులో భూమిని పోలిన గ్రహం ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
అక్కడికి వెళ్లాలంటే కాంతివేగంతో సమానంగా ప్రయాణించగల చిన్నపాటి హెలికాప్టర్‌ను రూపొందించాలని ఆయన సూచించారు. ఇందుకు అవసరమైన పరిశోధనల కోసం నిధులను అందించాలని ఇన్వెస్టర్లను ఆయన కోరారు. ఇన్వెస్టర్లు ముందుకు వస్తే రెండు దశాబ్దాల్లో కాంతివేగంతో సమానంగా ప్రయాణించే వాహనం తయారవుతుందన్నారు. అలా తయారు చేసే వాహనం ద్వారా ఆల్ఫా సెంటారీ నక్షత్రసముదాయంలోకి చేరుకోవచ్చన్నారు. అక్కడ భూమిని పోలిన గ్రహం ఉండే అవకాశముందని అందులో నివాసం ఏర్పరచుకునే అవకాశాలను అన్వేషించాలని ఆయన సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments