Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కులు లేకుండా వీధుల్లో యువత: బాపట్ల ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆగ్రహం

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (15:19 IST)
సహజంగా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటూ ఏ విషయంలోనూ తొందర పడకుండా నవ్వుతూ అందరినీ పలకరించి పనిచేసే బాపట్ల ఎమ్మెల్యే, ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి ఒక విషయం లో కోపం వచ్చింది.

కరోనా కట్టడికి అందరూ ఎంతో కష్టపడుతున్నారు. ఇంకా వీధుల వెంట కొంతమంది మాస్కులు లేకుండా నిర్లక్ష్యంగా తిరుగుతూ అసలు పని లేకపోయినా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి కరోనా వ్యాప్తికి సాధనాలుగా ఉపయోగపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన  నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న యువకులపై అసహనాన్ని వ్యక్తం చేశారు.
 
తీవ్ర సంక్షోభం ఉన్న ఈ సమయంలో ఒక ఆశా కిరణం ఇది. ఈ అపూర్వమైన COVID వేవ్ -2 పరిస్థితిని పరిష్కరించడానికి బాపట్ల ప్రజలు మరియు పరిపాలనా బృందానికి సాధ్యమైనంత సహాయాన్ని పొందడంలో బాపట్ల ఏరియా ఆసుపత్రికి ఆక్సిజన్ ప్లాంట్ మంజూరు చేయబడింది. బాధ్యతాయుతమైన పౌరులుగా మనమందరం కూడా మన వంతు కృషి చేయాలి. ఆ పని చాలా సులభం. ఇంట్లోనే ఉండండి..అత్యవసరం అయ్యితే తప్పా బయటకు రావొద్దు.

మాస్క్ లు ధరించకుండా చాలా మంది యువత వీధుల్లో తిరుగుతున్నట్లు మనం ఇంకా చూస్తున్నాం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ .. ఇంట్లో ఉండండి.. సురక్షితంగా ఉండండి .. మన సమాజాన్ని సురక్షితంగా ఉంచండి. అంటూ ఆయన వేడుకున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments