Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీజే సౌండ్‌కు కుప్పకూలిన యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

సెల్వి
మంగళవారం, 15 అక్టోబరు 2024 (22:20 IST)
DJ sound
మితిమీరిన సౌండ్‌, అత్యుత్సాహంతో వయసుతో సంబంధం లేకుండా అందరూ డాన్స్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా ఓ యువకుడు దసరా ఉత్సవాల్లో డాన్స్‌ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. 
 
అమలాపురం సమీపంలోని కొంకాపల్లి దసరా వేడుకల్లో డ్యాన్స్‌ చేస్తూ 21 ఏళ్ల యువకుడు కుప్పకూలిపోయాడు. అప్పటివరకూ సరదాగానే గడిపిన యువకుడు.. ఒక్కసారిగా స్పృహ తప్పిపోయేసరికి చుట్టుపక్కలవాళ్లు కంగారుపడ్డారు. 
 
వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అతనిని పరీక్షించిన వైద్యులు ఆ యువకుడు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. మృతుడు బండారులంకకు చెందిన 21 ఏళ్ల వినయ్‌గా గుర్తించారు.
 
కోనసీమ ప్రాంతంలో దసరాకి చెడీ తాలింఖానా విన్యాసాలతో దసరా వేడుకలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో డీజేకి అనుగుణంగా స్టెప్పులేస్తూ వినయ్‌ కుప్పకూలిపోవడంతో అంతా షాక్‌కి గురయ్యారు. వినయ్ డీజే బాక్సులకు అతి దగ్గరగా డ్యాన్స్ చేయడంతో ఒక్కసారిగా గుండెచప్పుడు పెరగడం వల్లే చనిపోయి ఉండవచ్చునని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments