Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను వంచించాడు.. పెళ్ళికి డబ్బు, నగలు తెచ్చింది.. కోరిక తీర్చలేదని చంపేశాడు..

ప్రేమిస్తున్నానన్నాడు. పెళ్ళి చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు. హ్యాపీగా షికార్లకు తీసుకెళ్లాడు. పెళ్ళికి ముహూర్తం పెట్టాను రమన్నాడు. ప్రేమ మైకంలో అతని వెంటనే ఆ బాలిక వెళ్ళింది. కోరిక తీర్చమంటే తప్పని

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (11:00 IST)
ప్రేమిస్తున్నానన్నాడు. పెళ్ళి చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు. హ్యాపీగా షికార్లకు తీసుకెళ్లాడు. పెళ్ళికి ముహూర్తం పెట్టాను రమన్నాడు. ప్రేమ మైకంలో అతని వెంటనే ఆ బాలిక వెళ్ళింది. కోరిక తీర్చమంటే తప్పని వారించింది. తప్పించుకునేందుకు ప్రయత్నించింది. చివరకు మానవమృగం చేతిలో బాలిక దారుణంగా హత్యకు గురైంది. గండిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అరెస్టు చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. చాంద్రాయణగుట్ట ప్రాంతంలో కూరగాయల వ్యాపారి కుమార్తె అమీనా(14). ఫలక్‌నుమా ప్రభుత్వ బాలిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తండ్రి కోసం తరచూ ఇంటికి వచ్చే అక్బర్‌తో పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడూ బైక్‌పై తిప్పేవాడు. సరదాగా తిప్పుతూ కావాల్సినవి కొనిస్తూ స్నేహం పెంచుకున్నాడు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది. 
 
అప్పటికే పెళ్లయిన అక్బర్‌ బాలికను ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు. పెళ్లి పేరిట డ్రామా ఆడటం ప్రారంభించాడు. దుబాయ్ వెళ్దామన్నాడు. డబ్బు తెమ్మన్నాడు. ఇదంతా నిజమేనని నమ్మిన ఆ బాలిక రూ. 40వేలతో వెళ్ళింది. 
 
అప్పటికే దురాలోచనతో ఉన్న అక్బర్‌ కోరిక తీర్చమంటూ ఒత్తిడి చేశాడు. లోబరుకునేందుకు ప్రయ త్నించాడు. పెళ్లి తర్వాతనే అంటూ తేల్చిచెప్పింది. వినక పోవటంతో ఎదిరించి పారిపోయేందుకు సిద్ధమైంది. బలవంతం చేస్తే తాను వెళ్లిపోతానని చెప్పడంతో కోపం ఆపుకోలేక అక్బర్‌ బాలికను కొట్టాడు. 
 
బుర్కాను చింపి చేతులు కట్టేశాడు. మాట వినలేదనే కసితో తనవెంట తీసుకెళ్లిన కత్తితో బాలిక గొంతు కోశాడు. చనిపోయిందని భావించి వెళ్లిపోబోతుండగా.. కేకలు వేసింది. భయపడిన అక్బర్‌ బాలిక ముఖంపై బండరాయితో మోది హతమార్చాడు. పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)

మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్‌టైన్మెంట్‌గా మారింది : నాగ చైతన్య (Video)

ఫన్‌మోజీ ఫేమ్ సుశాంత్ మహాన్ హీరోగా కొత్త చిత్రం.. పోస్టర్ విడుదల

అఖండ 2 – తాండవం లో బాలకృష్ణ ను బోయపాటి శ్రీను ఇలా చూపిస్తున్నాడా ?

ప్ర‌తి ఒక్క‌రూ హెల్త్ కేర్ తీసుకోవాలి : ఐశ్వర్య రాజేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments