Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరెస్టు కోసం అమితాసక్తిగా ఎదురు చూస్తున్నా? : పేర్ని నాని

ఠాగూర్
గురువారం, 3 జులై 2025 (14:34 IST)
తమను ఎపుడు అరెస్టు చేస్తారా అని అమితాసక్తిగా ఎదురు చూస్తున్నట్టు వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. గత కొన్ని రోజులుగా తన అరెస్టుపై సాగుతున్న ప్రచారంపై ఆయన గురువారం స్పందించారు. తనపై ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్.ఐ.ఆర్ నమోదు కాలేదన్నారు. అలాంటపుడు అరెస్టు ఎలా చేస్తారని ప్రశ్నించారు. దుమ్ముంటే తనను అరెస్టు చేయాలంటూ ప్రభుత్వానికి బహిరంగంగా సవాల్ విసిరారు. 
 
మచిలీపట్నంలో పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత నెల రోజులుగా నన్ను అరెస్టు చేస్తారని కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయి. నేను పారిపోతాననే ఉద్దేశంతో ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారు. కానీ, నేను ఎక్కడికి వెళ్లను. ఇక్కడే ఉంటాను అని ఆయన తేల్చిచెప్పారు. 
 
ఇది కేవలం పచ్చమీడియా చేస్తున్న ప్రచారమని, వారి సుకానందం కోసమే ఇలాంటి వార్తలు రాస్తున్నారని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యేడాది పూర్తయిన నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే తన అరెస్టు అంశాన్ని తెరపైకి తెచ్చారని పేర్ని నాని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments