Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితిన్ గ‌డ్కారీని క‌లిసిన వైసీపీ పార్ల‌మెంట‌రీ బృందం

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (17:42 IST)
ఏపీకి చెందిన వైసీపీ ఎంపీలు ఢిల్లీలో రోజుకో కేంద్ర మంత్రిని క‌లుస్తున్నారు. ఆ పార్టీ అధినేత‌, ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చిన ప్లానింగ్ ప్ర‌కారం పార్ల‌మెంటును క‌ల‌య తిప్పేస్తున్నారు. రోజూ పార్ల‌మెంటు స‌మావేశాల‌కు హాజ‌రుకావడం... బ్రేక్‌లో ఒక్కో కేంద్ర మంత్రిని క‌ల‌వ‌డం వారికి డెయిలీ రొటీన్‌గా మారింది.
 
ఇటీవ‌ల వైసీపీ ఎంపీల బృందం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తో స‌హా ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను క‌లిసి, విశాఖ ఉక్కు ప్ర‌యివేటీక‌ర‌ణ అంశంపై విన‌తి ప‌త్రాలు ఇచ్చారు. తామే కాకుండా, విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట స‌మితి నాయ‌కుల‌ను కూడా ఢిల్లీకి ర‌ప్పించి, కేంద్ర మంత్రుల‌కు విన‌తి ప‌త్రాలు ఇప్పించారు.

ఇపుడు తాజాగా రాష్ట్రంలోని పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలంటూ, కేంద్ర  మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఆయ‌న‌కు డిమాండుల‌తో కూడిన వినతిపత్రం సమర్పించారు. కేంద్ర మంత్రిని క‌లిసిన వారికి  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సార‌ధ్యం వ‌హించ‌గా, లోక్ సభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పక్ష నేత శ్రీ మిథున్ రెడ్డి, పార్టీ ఎంపీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments