Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఉక్కు కోసం ఆగ‌స్టు 2, 3న ఛ‌లో ఢిల్లీ!

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (17:32 IST)
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణలపై ఏపీకి అన్యాయం చేసేలా కేంద్ర మంత్రుల సమాధానాలున్నాయ‌ని, వారిది పూర్తిగా మొండి వైఖ‌రి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమ‌ర్శించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అయినప్పటికీ, 2014 ఏప్రిల్ అంచనా వ్యయమే భరిస్తామని కేంద్ర మంత్రి షెకావత్ సమాధానమివ్వడం దుర్మార్గమ‌న్నారు.

అలాగే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించి తీరుతామని కేంద్ర మంత్రులు పదేపదే మొండి వైఖరితో సమాధానం ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని రామ‌కృష్ణ చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆగస్టు 2, 3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం చేస్తున్న‌ట్లు చెప్పారు.

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5న ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నామ‌ని చెప్పారు. దీనిపై ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు సమైక్యంగా పోరాడాల్సిన తరుణమిద‌ని రామకృష్ణ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments