Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకూతుళ్లను కాదని.. దివ్వెల మాధురితో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్!

సెల్వి
శుక్రవారం, 9 ఆగస్టు 2024 (20:09 IST)
Duvvada Srinivas
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కాపురం బజారున పడింది. మొదటి భార్య వాణిని కాదని మరో మహిళ దివ్వెల మాధురితో సహజీవనం చేస్తున్న వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 
 
ఇద్దరు కూతుళ్లు ఉన్నప్పటికి భార్య, పిల్లల దగ్గర ఉండకుండా దివ్వెల మాధురితో కలిసి జీవిస్తున్నాడని స్వయంగా కూతుళ్లు హైందవి, నవీన తండ్రిని కలిసి నిలదీయాలని ప్రయత్నించారు. అయితే పోలీసులు అనుమతించకపోవడంతో విషయాన్ని మీడియాకు తెలియజేశారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది.
 
తన భర్త దువ్వాడ శ్రీనివాస్‌తో ఉండాలని కోరుకోవడం లేదని దువ్వాడ వాణి స్పష్టం చేశారు. ఆయన వల్ల తన కుటుంబం పరువు పోతుందని అన్నారు. దువ్వాడ శ్రీనివాస్‌ టెక్కలి వదిలివెళ్లాలని డిమాండ్‌ చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌ వల్ల తనకేమీ ఆస్తులు రాలేదని స్పష్టం చేశారు.

చొక్కా లుంగీతో వచ్చిన శ్రీనివాస్‌కు ఎలాంటి ఆస్తులు లేవని వెల్లడించారు. ఆయన రాజకీయాలతో తామే ఎక్కువగా నష్టపోయామని తెలిపారు. కూతురుకు పెళ్లైన తరుణంలో శ్రీనివాస్‌కి ఈ బుద్ధులేంటని ప్రశ్నించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తనకు తగిన శాస్తి జరిగిందన్నారు. 
 
అయితే దువ్వాడ శ్రీనివాస్ భార్య, పిల్లలు చేస్తున్న ఆరోపణలకు దివ్వెల మాధురి కౌంటర్ ఇచ్చారు. తమది ఇల్లీగల్ అఫైర్ కాదని తెలిపింది. ఇంత వరకు వచ్చింది కాబట్టి ఇకపై ఆయనతోనే కలిసి ఉంటానని తెగేసి చెప్పింది మాధురి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments