Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు ధైర్యముంటే జగన్‌తో పాటు నడవాలి: రోజా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు హలూసినేషన్ సిక్స్ స్టేజ్‌లో వున్నారని.. ఆ స్టేజ్‌లో చేయనివన్నీ చేసినట్టుగా అలా అనిపిస్తుందని.. చంద్రబాబుక

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2017 (13:38 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు హలూసినేషన్ సిక్స్ స్టేజ్‌లో వున్నారని.. ఆ స్టేజ్‌లో చేయనివన్నీ చేసినట్టుగా అలా అనిపిస్తుందని.. చంద్రబాబుకు ప్రస్తుతం అదే జబ్బు పట్టుకుందని నిప్పులు చెరిగారు. ఆ జబ్బు ప్రభావంతోనే రాష్ట్రంలో ఏ సమస్యా లేదని చంద్రబాబు చెప్తున్నారని, రుణమాఫీ చేశానని, నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చానని చెప్పుకుంటున్నారన్నారు. 
 
రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకోవాలన్న ఆకాంక్షతో జగన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని.. ఈ యాత్రను చూసి తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని రోజా విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ధైర్యముంటే జగన్‌తో పాటు నడిచి, ఏ గ్రామంలో ఏ అభివృద్ధి జరిగిందో చూపించాలని రోజా సవాల్ విసిరారు. 
 
ఎక్కడైనా రోడ్లు, డ్రైనేజీలు సక్రమంగా ఉన్నాయా? అని ఆమె ప్రశ్నించారు. ఈ మూడేళ్లలో ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం వచ్చిందా? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. దోచుకున్నది దాచుకోవడమే తప్ప చంద్రబాబు మరేమైనా చేశారా? అంటూ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments