Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీళ్లిద్దరూ లక్ష్మీపార్వతులే... ఎన్టీఆర్ సతీమణి ఏం చేస్తుందో?

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో ఎన్టీఆర్ భార్య పాత్రయిన లక్ష్మీపార్వతిగా వైసీపి ఎమ్మెల్యే రోజా నటిస్తోందన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో లక్ష్మీపార్వతి పాత్ర తెదేపా చీఫ్ చ

Advertiesment
వీళ్లిద్దరూ లక్ష్మీపార్వతులే... ఎన్టీఆర్ సతీమణి ఏం చేస్తుందో?
, బుధవారం, 8 నవంబరు 2017 (15:36 IST)
'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో ఎన్టీఆర్ భార్య పాత్రయిన లక్ష్మీపార్వతిగా వైసీపి ఎమ్మెల్యే రోజా నటిస్తోందన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో లక్ష్మీపార్వతి పాత్ర తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా వుంటుందనే ప్రచారం వుండనే వుంది. ఇదిలావుంటే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తీయబోయే లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రంలో లక్ష్మీపార్వతి పాత్రకోసం వాణీ విశ్వనాథ్‌ను సంప్రదించారట. 
 
ఈ చిత్రంలో లక్ష్మీపార్వతి పాత్ర నెగటివ్‌గా వుంటుందనే టాక్ వినబడుతోంది. అంటే... తెదేపాకు అనుకూలంగా అన్నమాట. మొత్తమ్మీద ఇద్దరు నటీమణులు ఒకేసారి లక్ష్మీపార్వతి పాత్రల్లో నటించేందుకు ఒకవేళ సిద్ధమైతే అటు వర్మ, ఇటు కేతిరెడ్డి పంట పండినట్లే. కావాల్సినంత పబ్లిసిటీ వచ్చిపడుతుంది. 
 
రెండు చిత్రాల్లో వీరిద్దరూ ఆ పాత్రల్లో నటిస్తే ఇక సక్సెస్ అనే దాని గురించి ఆలోచించనక్కర్లేదు. ఇకపోతే నగరి నియోజకవర్గంలో రోజాను చాలా తేలిగ్గా ఓడించేయవచ్చని వాణీ విశ్వనాథ్ ఇప్పటికే ప్రకటించి రోజాకు ఓ రకమైన షాక్ ఇచ్చింది. మరి అంత తేలిగ్గా ఓడించగల వ్యూహం వాణి వద్ద ఏమున్నదో మరి. మొత్తమ్మీద రోజాను ధీటుగా ఎదుర్కొనగల మహిళా నాయకురాలయితే తెదేపాకు దొరికిందని అంటున్నారు. మరి ఎన్నికల నాటికి వాణి ఏం చేస్తుందో? అసలు వీరు నటించబోయే పాత్రల గురించి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఏమంటారో?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగచైతన్యపై సమంతకు అనుమానం.. ఏ విషయంలో?