Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ నేతలు లైడిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమా?:దీపక్ రెడ్డి

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (11:46 IST)
స్థానికఎన్నికల్లో ప్రభుత్వం వైసీపీ కోడ్ అమలుచేసిందని,  అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేశాడని, గెలుపునిచూసి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న వైసీపీనేతలంతా రాబోయేతరాలు ఈ ఎన్నికల గురించి, గెలుపుగురించి తప్పకుండా చెప్పుకుంటాయని, గెలిచినవారంతా ప్రజాస్వామ్యస్ఫూర్తితో ముందుకెళ్లాల ని కోరుకుంటున్నానని టీడీపీజాతీయ అధికారప్రతినిధి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఆయన తననివాసంనుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. భర్తలను కోల్పోయిన ఇద్దరు మహిళలు, వారిపిల్లల్ని కుటుంబాలను పోషించుకోవడానికి చెరోదారి వెతుక్కున్నారని, వారిలో ఒకామె వేశ్యగా మారితే, మరోకామె కష్టపడి కూలీపనిచేస్తుందన్నారు. ఆ ఇద్దరిలో సమాజంలో ఎవరికి గుర్తింపు ఉంటుందో రాష్ట్రప్రజలే చెప్పాలన్నారు.

అదేవిధంగా యుద్ధంలో ధీరులు ముందుకువెళుతూ పోరాడి విజయం సాధిస్తారని, మరికొందరు వెనుకనుంచి వెన్నుపోటు పొడిచి గెలుస్తారని, వారిలో ఎవరిది నిజమైన విజయమో కూడా ప్రజలు ఆలోచించాలన్నారు. ఎన్నికలు సజావుగా జరిగాయా లేదా అనేది అప్రస్తుతమన్న దీపక్ రెడ్డి, ఎడిటర్స్ గిల్డ్ అనేసంస్థ రాష్ట్రంలో స్థానికఎన్నికల్లో గెలవడం కోసం అధికార పార్టీ దాదాపు రూ.10వేలకోట్ల వరకు ఖర్చుచేసినట్లు చెప్పిందన్నారు.

ఎన్నికల్లో ఖర్చుచేసిన సొమ్మంతా ఎక్కడినుంచి వచ్చిందో ప్రజలే ఆలోచనచేయాలన్నారు.  ఏకగ్రీవాలయ్యా యని జబ్బలు చరుచుకుంటున్న వైసీపీనేతలు, రాజ్యాంగాన్ని కాలరాశారనే వాస్తవం విస్మరించడం సిగ్గచేటన్నారు. టీడీపీకి అభ్యర్థులు లేరని చెబుతున్న వైసీపీకి తమ పార్టీతరుపున పోటీచేసిన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని చెప్పినా అధికారపార్టీ నుంచి స్పందనలేదన్నారు.

గతంలో జరిగిన స్థానికఎన్నికలతో పోలిస్తే, ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో 5శాతం వరకు ఓటింగ్ శాతం తగ్గిందన్నారు. అధి కారపార్టీ దౌర్జన్యాలు, దుర్మార్గాలు చూసిఓటర్లు బయటకు రాలేదన్నారు. రౌడీబలాన్ని, పోలీసుబలగాలను వాడటంతో పాటు, విచ్చలవిడిగా డబ్బును ఖర్చుచేయబట్టే, అధికారపా ర్టీకి గెలుపు దక్కిందన్నారు.

స్థానికఎన్నికల్లో గెలుపుకోసం రిగ్గింగులు, బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపచేయ డం, పోలింగ్ ఏజెంట్లపై దాడిచేయడం, అధికారులతో కుమ్మ క్కవ్వడం,  తెలుగుదేశంనాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం వంటి అనేకదాష్టీకాలకు అధికారపార్టీ పాల్ప డిందన్నారు.

ఇన్నఅరాచకాలు, కుట్రలు చేసి సాధించిన విజయం నిజమైన విజయమో, కాదో ప్రజలే ఆలోచనచేయా లన్నారు. అధికారపార్టీ ఆగడాలపై ఎన్నికలకమిషన్ కు ఫిర్యాదుచేసినా ఎటువంటి స్పందనలేదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 2వేలవరకుఘటనలు జరిగాయని, మున్సిపల్ ఎన్నికల్లో కూడా అనేకదారుణాలు జరిగాయన్నా రు.

టీడీపీతోపాటు, ఇతరపార్టీలు చేసిన ఫిర్యాదులపై కూడా ఎన్నికలకమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. వైసీ పీ వాపుని బలుపు అనుకుంటోందన్నారు. 2012లో జరిగిన రాయదుర్గం ఉపఎన్నికలో వైసీపీ విజయం సాధించిందని,  ఆతరువాత సంవత్సరంన్నరకే జరిగిన స్థానికఎన్నికల్లో టీడీ పీ ఘనవిజయం సాధించిందన్నారు. కేవలం ఏడాదిన్నరకే ఎటువంటి మార్పువచ్చిందో ప్రజలుగమనించాలన్నారు. 

2012లోజరిగిన ఉపఎన్నికల్లో వైసీపీగెలిస్తే, 2014లో జరిగిన ప్రధాన ఎన్నికల్లో గతంలో గెలిచినస్థానాలను కూడా వైసీపీ కోల్పోయిందన్నారు. ఆనాటి ప్రతిపక్షపార్టీ పనితీరు చూసి విసుగుతో 23మంది ఎమ్మెల్యేలు ఆపార్టీనివదిలేశారన్నారు.  ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం ఇంకా మూడేళ్లు అధికారంలో ఉంటుందనిభావించిన ప్రజలు, సమస్యలు కొనితెచ్చుకోవడం ఇష్టంలేకనే వైసీపీకి ఓట్లేశారని దీపక్ రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో వైసీపీని ఎదిరించేది, ఎప్పటికైనా ఓడించేది తెలుగుదేశంపార్టీ యేననే వాస్తవంమాత్రం ప్రజలకు అర్థమైందన్నారు.  పురపోరులో 2,123 స్థానాల్లో ఎన్నికలు జరిగితే, బీజేపీ కేవ లం 8స్థానాలు మాత్రమే గెలిచి, 0.37శాతానికే పరిమితమైం దన్నారు. జనసేన 19స్థానాల్లో గెలిచి, 0.89శాతం ఓటింగ్ షేర్ పొందిందన్నారు.

రెండుపార్టీలు కలిపికూడా 1.27శాతాని కే పరిమితమయ్యాయన్నారు. తెలుగుదేశంపార్టీకి ఆరెండు పార్టీలకంటే పదిరెట్లు ఎక్కువస్థానాలు వచ్చాయన్నారు. బీజేపీ పరిస్థితి ఎందుకింత దారుణంగా తయారైందనే దానిపై కూడా ప్రజల్లో చర్చజరుగుతోందన్నారు.

ఆనాడు రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహంచేస్తే, నేడు బీజేపీ నమ్మకద్రోహ చేసిందనే బాధ ప్రజల్లో ఉందన్నారు. బీజేపీ వైసీపీ చీకటిఒప్పందంచేసుకున్నాయనే భావన కూడా రాష్ట్ర వాసుల్లో ఉందన్నారు. బీజేపీ చర్యలను వైసీపీ సమర్థిస్తోంద ని, రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గాలను బీజేపీ ప్రశ్నించకపోవడా న్నిచూసే ప్రజల్లో అటువంటి అభిప్రాయం ఏర్పడిందన్నారు. 

వైసీపీగెలుపుపై ప్రజలకున్న సందేహాలను నివృత్తి చేసేందు కు, ఆపార్టీకి చెందిన పదిమంది సీనియర్ నేతలకు లైడిటెక్టర్ టెస్ట్ చేయిస్తామని, వారంతా గెలుపుకోసం తాముఎటువంటి అక్రమాలు, అన్యాయాలకు పాల్పడలేదని నిజం చెప్పగలరా అని దీపక్ రెడ్డి సవాల్ విసిరారు. పదిమంది నాయకుల్లో ఒక్కరైనాసరే లైడిటెక్టర్ టెస్ట్ లో పాసైతే, వారికి నమస్కరించి వారివిజయాన్ని టీడీపీ పొగుడుతుందన్నారు.

గెలుపును సాకుగాచూపి, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న వైసీపీనే తలంతా తామువిసిరే సవాల్ కు కట్టబడి ఉంటారా అని దీపక్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సాధించింది నిజమైన విజయమే అయితే, తాడపత్రిలో ఆపార్టీ ఎమ్మెల్యేతో వైసీపీ నాయకత్వం తక్షణమే రాజీనామా చేయించాలన్నారు.

రాజీనామా తరువాత జరిగే ఉపఎన్నికలో వైసీపీ గెలిస్తే, స్థానిక ఎన్నికల్లో వారుసాధించింది నిజమైన విజయమని తాము, తమపార్టీ ఒప్పుకుంటుందన్నారు. వైసీపీనేతలు, బ్రిటీషు వారిలా కండకావరంతో మాట్లాడుతున్నారని, అధికారపార్టీ ఎంతలా ప్రలోభాలు, దౌర్జన్యాలుచేసినా, రాష్టప్రజలను బానిస లుగా మారనివ్వబోమన్నారు.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేం దుకు, వైసీపీ దౌర్జన్యాలను ఎదిరించి, ఎన్నికల్లో పోరాడటం ద్వారా టీడీపీ కార్యకర్తలు నిజమైన దేశభక్తులుగా నిరూపిం చుకున్నారన్నారు. తాడిపత్రి, మైదుకూరు నియోజకవర్గాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి ఎందుకు ఓటింగ్ శాతం తగ్గిందో ఆపార్టీనేతలే చెప్పాలన్నారు.

వైసీపీ బెదిరింపులు, అదిరింపులకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అదరరు, బెదరరనే వాస్తవాన్ని అధికారపార్టీ గ్రహిస్తే మంచిద ని దీపక్ రెడ్డిహితవుపలికారు. చంద్రబాబునాయుడు స్ఫూర్తితో ప్రతిఒక్కటీడీపీనాయకుడు, కార్యకర్త రాష్ట్రాన్ని వైసీపీ నుంచి కాపాడుకోవడానికి పోరాడుతూనే ఉంటారన్నా రు. వైసీపీ ఆగడాలకు, దుశ్చర్యలకు, దుర్మార్గాలకు అడ్డుకట్ట వేసేది ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీయేనని దీపక్ రెడ్డి తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments