Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇడుపుల‌పాయ‌లో తండ్రి వై.ఎస్. స‌మాధిని నివాళి అర్పించి...

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (15:25 IST)
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఇడుపులపాయకు చేరుకున్నారు. త‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌తో క‌లిసి ఆమె కడప విమానాశ్రయం చేరుకోగా, విమానాశ్రయం వద్దకు పెద్ద ఎత్తున వైఎస్ కుటుంబ అభిమానులు వారికి స్వాగ‌తం ప‌లికారు. అనంతరం రోడ్డు మార్గాన కాన్వాయ్ తో ఇడుపులపాయకు పయనమైన షర్మిల అక్క‌డ త‌న తండ్రి స‌మాధి వ‌ద్ద‌కు చేరుకున్నారు. వైఎస్ షర్మిల వెంట వైఎస్ విజయమ్మ, ఇతర పార్టీ నాయకులు వ‌చ్చారు. వైఎస్ షర్మిల , వైఎస్ విజయమ్మ, వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. 
 
వైఎస్సార్‌టీపీని అధికారికంగా ప్రకటించి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 20వ తేదీన చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరిట పాద యాత్రకు వైఎస్‌ షర్మిల శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు ష‌ర్మిల‌. ఇడుపుల‌పాయ గెస్ట్ హౌస్‌లో బస చేసి, తిరిగి సాయంత్రం ఇడుపులపాయ నుంచి హైదరాబాద్‌కు ష‌ర్మిల వెళ్లనున్నారు. ష‌ర్మిల చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరిట పాద యాత్ర విజ‌య‌వంతం కావాల‌ని వై.ఎస్. అభిమానులు ఆంకాంక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments