Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందీ వస్తేనే డబ్బులు రీఫండ్ చేస్తాం : జొమాటో కస్టమర్ సిబ్బంది

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (14:53 IST)
దేశంలోని ఆన్‌లైన్ ఫుడ్‌డెలివరీ ఫ్లాట్‌ఫామ్‌లలో ఒకటైన జొమాటా మరోమారు వివాదంలో చిక్కుకుంది. ఓ వ్యక్తి జోమాటాలో ఫుడ్ అర్డర్ చేశాడు. కానీ అతనికి వచ్చిన ఫుడ్‎లో ఒక ఐటమ్ మిస్ అయింది. దీంతో అతను జోమాటో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‎ను సంప్రదించాడు. అయితే ఎగ్జిక్యూటివ్‎ హిందీ వస్తే డబ్బులు తిరిగి వస్తాయని చెప్పడం ఇపుడు వివాదాస్పదంగా మారింది. 
 
ఈ విషయాన్ని వినియోదారుడు ట్విట్టర్‎లో పోస్ట్ చేశాడు. దీంతో జోమాటోపై ట్విట్టర్‎లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ‎కస్టమర్ పోస్ట్ వైరల్ అయిన తర్వాత 'రిజెక్ట్ జోమాటో' ట్విట్టర్‌లో ట్రెండింగ్‎లోకి వచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడుకు చెందిన వికాష్ జోమాటో ఫుడ్ అర్డర్ చేశాడు. తన ఆర్డర్‌లో ఒక వస్తువు మిస్ అయినట్లు గుర్తించిన తర్వాత అతను జోమాటో కస్టమర్ సర్వీస్‌ని సంప్రదించాడు. 
 
వికాష్ ప్రకారం, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ‘హిందీ తెలియదు’ కాబట్టి చెల్లింపును తిరిగి చెల్లించలేమని చెప్పాడు. చాట్ స్క్రీన్‌షాట్‌ను కూడా వికాష్ ట్విట్టర్‎లో పంచుకున్నాడు. “జోమాటో తమిళనాడులో అందుబాటులో ఉంటే, వారు భాషను అర్థం చేసుకున్న వ్యక్తులను నియమించుకోవాలి” అని వికాష్‌ చాట్ చేశాడు. 
 
అప్పుడు ఎగ్జిక్యూటివ్ ” సమాచారం కోసం, హిందీ మన జాతీయ భాష. కాబట్టి ప్రతి ఒక్కరూ హిందీని కొద్దిగా తెలుసుకోవడం సర్వసాధారణం.” ఈ ప్రతిస్పందన వికాష్‌కి కోపం తెప్పించింది, 'భారతీయుడిగా నేను హిందీ నేర్చుకోవాలి' అని ట్యాగ్ చేశారు. ప్రతిస్పందనగా, జొమాటో ఈ సంఘటన 'ఆమోదయోగ్యం కాదు' అని చెప్పింది. 

 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments