Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి పులివెందులలో జగన్ పర్యటన.. 25న క్రిస్మస్ వేడుకలు

ఠాగూర్
మంగళవారం, 24 డిశెంబరు 2024 (11:21 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన మంగళవారం ఉదయం 11 గంటలకు బెంగుళూరు నుంచి పులివెందులకు చేరుకుంటారు. 
 
తొలుత ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్‌కు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ప్రేయర్ హాల్‌లో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కడప నియోజకవర్గం నేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు పులివెందులకు బయలుదేరి వెళతారు. 
 
రాత్రికి పులివెందులలోని నివాసంలో బస చేస్తారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభిస్తారు. రాత్రికి పులివెందులలో బస చేస్తారు. 
 
26వ తేదీన ఉదయం పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. 27వ తేదీ ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్‌లో జరిగే వివాహానికి ఆయన హాజరవుతారు. ఆ తర్వాత పులివెందుల నుంచి బెంగుళూరుకు చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments