ముస్లిం ఆస్తుల సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ వ్యవహారాల శాఖా మంత్రి బేపారి అంజాద్ బాషా అభయమిచ్చారు.
సచివాలయంలో ఈరోజు సాయంత్రం యునైటెడ్ ముస్లిమ్స్ అఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ , కొండపల్లి ఆస్థాన గురుప్రఖులు హజరత్ మహమ్మద్ అల్తాఫ్ ఆలీ రజా, ముస్లిం హక్కుల పోరాటసమితి అధ్యక్షులు షేక్ ఖాజావలి మంత్రిని కలిశారు .
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముస్లిం ఆస్తులు ముస్లింలు మాత్రమే అనుభవించేలా ప్రభుత్వం ఉత్తర్వులను ఇప్పించాలని కోరారు. 425, 426 జివొ వక్ఫ్ బోర్డు భుములకు కుడా వర్తించాలి.
రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ వక్ఫ్ అస్తులు నూటికి తొంభై శాతం ఇతర మతస్థుల చేతిలో ఉన్న మాట వాస్తవమని విజయవాడ ఇందాద్ ఘర్ జామియామసీదు షాపింగ్ కాంప్లెక్స్ ఖాజీ మాన్యం పంజా ఆస్తులు, మసిదు అస్తులు ఏ జిల్లాలో చూసినా నూటికి తొంభై శాతం ఇతర మతస్తులు ఆనుభవిస్తున్నారు.
వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, దేవాలయాల ఆస్తుల్లో ముస్లింలు క్రైస్తవులు వేరే మతస్థులు రాకూడదని చెప్పినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ వక్ఫ్ భుమి లో కూడా ముస్లింలే ఉండాలని చట్టాలు తెచ్చి నట్లయితే ఇది ముస్లిం మైనార్టీలకు చాలా ఉపయోగపడుతుందని, కాబట్టి 425, 426 జీవోని ముస్లిం మైనార్టీల ఆస్తులపై కూడా ఉపయోగించినట్లయితే ముస్లింలకు మేలు జరుగుతుంది.
కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముస్లిం ఆస్తుల్లో ముస్లిములు మాత్రమే అనుభవించాలి అని చట్టాలు తీసుకురావాలని రాష్ట్ర ముస్లిం సంఘాల డిమాండ్ చేసారు. వీరి వినతిని స్వీకరించిన మంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో మైనారిటీల ఆస్తులను తక్షణం గుర్తించి , వాటిని ఇతరులు అనుభవిస్తున్న తరుణంలో ఉపేక్షించబోమన్నారు.
ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లి అవసరమైతే నూతన జీవో ను విడుదల చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సంక్షేమ సమితి అధ్యక్షులు మొహమ్మద్ ముక్తర్ ఆలీ , వైసిపి మైనారిటీ సెల్ నాయకులు ఖలీల్ అహమ్మద్ రాజవీ, ఇతర ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు.