Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడు మోసం చేశాడని చెప్పుతో కొట్టింది.. ఆపై పెళ్లి చేసుకుంది (video)

ప్రియుడు మోసం చేశాడని ఓ యువతి కాళిగా మారిపోయింది. మూడేళ్ల పాటు సహజీవనం చేసి.. తనకు హ్యాండిచ్చేందుకు సిద్ధమవుతున్నాడని తెలిసి.. ప్రియుడిని చెప్పుతో కొట్టింది. పెళ్లి చేసుకోమంటే అప్పు తీర్చాలని.. ఆ డబ్బ

Webdunia
బుధవారం, 31 జనవరి 2018 (12:27 IST)
ప్రియుడు మోసం చేశాడని ఓ యువతి కాళిగా మారిపోయింది. మూడేళ్ల పాటు సహజీవనం చేసి.. తనకు హ్యాండిచ్చేందుకు సిద్ధమవుతున్నాడని తెలిసి.. ప్రియుడిని చెప్పుతో కొట్టింది. పెళ్లి చేసుకోమంటే అప్పు తీర్చాలని.. ఆ డబ్బు ఎక్కడి నుంచి తేవాలంటూ సాకులు చెప్తూ.. మోసం చేయాలని చూసిన ప్రియుడికి చుక్కలు చూపించింది. అడ్డొచ్చిన ప్రియుడి కుటుంబీకులను కూడా చిన్నాపెద్దా లేకుండా చెప్పుతో దాడి చేసింది.
 
కోపాన్ని నిగ్రహించుకోలేక ప్రియుడిపై దాడి చేసిన యువతి చివరికి అతని చేతులతో మూడు ముళ్లు వేయించుకుంది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు, పన్యం, తండాకు చెందిన దివ్యా భాయ్‌, నంద్యాలకు చెందిన చంద్రశేఖర్‌లు ప్రేమించుకుంటున్నారు. మూడేళ్ల పాటు ప్రేమించుకుంటున్నారు. చంద్రశేఖర్ కోసం దివ్యా ఇంటిని వదిలిపెట్టి అతని కోసం కాపురం పెట్టింది. 
 
పెళ్లి చేసుకోకుండా చంద్రశేఖర్‌పై నమ్మకంతో ఇన్నాళ్లు మిన్నకుండిన దివ్యకు.. చంద్రశేఖర్ మోసం చేయబోతున్నట్లు తెలిసింది. వేరే అమ్మాయిని వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అంతే చంద్రశేఖర్ వద్దకు బంధువులతో వచ్చి దివ్య అందరూ చూస్తుండగానే చెప్పుతో కొట్టింది. చెంప వాయించింది. బంధువులపై కూడా దాడి చేసింది. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే నంద్యాల పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆ జంట పెళ్లి ద్వారా ఒక్కటైంది. స్థానిక ఆలయంలో వీరిద్దరి పెళ్లి బంధువుల సమక్షంలో జరిగింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments